ఆర్మీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్మీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి

Apr 3 2025 1:50 AM | Updated on Apr 3 2025 1:50 AM

ఆర్మీ

ఆర్మీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి

భువనగిరిటౌన్‌ : ఇండియన్‌ ఆర్మీలోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి సాహితీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అగ్నివీర్‌లో జనరల్‌ డ్యూటీ, టెక్నికల్‌, క్లర్క్‌, స్టోర్‌ కీపర్‌ 10వ తరగతి, అగ్నివీర్‌ ట్రేడ్‌మన్‌ పోస్టులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఐటీఐ, డిప్లొమో ఉత్తీర్ణతతో పాటు ఎన్‌సీసీ కలిగిన అభ్యర్థులకు బోనస్‌ మార్కులు ఉంటాయన్నారు. 13 భాషల్లో ఆన్‌లైన్‌ విధానం ద్వారా పరీక్ష ఉంటుందన్నారు. ఆసిక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు www.ojinindia narmy.nic. ద్వారా ఏప్రిల్‌ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్‌లోని రిక్రూటింగ్‌ కార్యాలయం ఫోన్‌ నంబర్‌ 040–27740205లో సంప్రదించవచ్చన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రికి ‘దివిస్‌’ చేయూత

చౌటుప్పల్‌ : పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి లింగోజిగూడెంలోని దివిస్‌ పరిశ్రమ యాజమాన్యం రూ.15,77, 450 విలువ చేసే వైద్య పరికరాలను అందజేసింది. బుధవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ చిన్నానాయక్‌కు వాటిని అందజేశారు.ఈ సందర్భంగా డీసీహెచ్‌ఎస్‌ మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు దివీస్‌ అందించిన పరికరాలు దోహదపడుతాయన్నారు. ఇతర పరిశ్రల యాజమాన్యాలు సైతం తమ సీఎస్‌ఆర్‌ నిధులను అందించి ప్రజలకు తోడ్పాటును అందించాలని కోరారు. కార్యర్రమంలో ఆస్పత్రి వైద్యులు అలివేలు, దేవేందర్‌, సంతోష్‌, రజినీ, దివిస్‌ లైజన్‌ అధికారి బీకేకే చౌదరి, ప్రతినిధులు గోపి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

యాదగిరి నృసింహుడికి నిత్యారాధనలు

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, అర్చనతో కొలిచారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అష్టోత్తర పూజలు చేపట్టారు. ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం నిర్వహించి ఆలయద్వార బంధనం చేశారు.

త్రిఫ్టు పథకం వర్తింపజేయాలని దీక్ష

భూదాన్‌పోచంపల్లి : మగ్గం నేసే ప్రతి కార్మికుడికి త్రిఫ్ట్‌ పథకం వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం అఖిలపక్షాల చేనేత నాయకులు, కార్మికులు భూదాన్‌పోచంపల్లిలోని ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా అఖిలపక్షాల చేనేత నాయకులు మాట్లాడుతూ ఇటీవల అధికారులు త్రిఫ్ట్‌ పథకం సర్వే చేసి మగ్గం నేసే చేనేత కార్మికులు, అనుబంధ కార్మికుల పేర్లను తొలగించారని పేర్కొన్నారు. జియోట్యాగింగ్‌ లేని మగ్గాలకు కూడా జియోట్యాగింగ్‌ నంబర్లు వేసి అర్హులందరికీ పథకాలను అమలు చేయాలని కోరారు. అనంతరం చేనేత, జౌళిశాఖ డీఓ రాజేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతకింది రమేశ్‌, కర్నాటి పురుష్తోతం, చిక్క కృష్ణ, గంజి బస్వలింగం, కోడె బాల్‌నర్సింహ, మిర్యాల కృష్ణమూర్తి, సీత కృష్ణ, మంగళపల్లి శ్రీహరి, భారత భూషణ్‌, వేశాల మురళి, బింగి భాస్కర్‌, ఆటిపాముల మహేందర్‌, ఈపూరి విష్ణు, ముసునూరి రాములు, గుండు ప్రవీణ్‌ పాల్గొన్నారు.

ఆర్మీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి  1
1/2

ఆర్మీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి

ఆర్మీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి  2
2/2

ఆర్మీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement