వేసవిలో నాటుకోళ్ల పెంపకంలో జాగ్రత్తలు | - | Sakshi
Sakshi News home page

వేసవిలో నాటుకోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

Mar 19 2025 1:44 AM | Updated on Mar 19 2025 1:44 AM

వేసవి

వేసవిలో నాటుకోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

చికిత్స, నివారణ చర్యలు ఇలా..

ఈ వ్యాధి సోకితే కిలో బరువుగల కోడికి బ్యూటినోరెట్‌ 150 మిల్లీ గ్రాములు, డైక్లోరోఫెన్‌ 200 గ్రాములు దాణాలో ఇవ్వాలి. మెబెండజోల్‌ పౌడర్‌ వంద కోళ్లకు 10 మి.గ్రా. చొప్పున దాణాలో ఇవ్వాలి. ఫెన్‌బెండజోల్‌ మరియు ఫ్రాజీక్వాంటాల్‌ వంటి ఇతర మందులను కూడా వాడవచ్చు. అలాగే కోళ్లు పెంచే ప్రాంతాలలో కీటకాలు వ్యాప్తి చెందకుండా డెల్టామెత్రిన్‌ అనే మందు ద్రావణాన్ని నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేకపోతే ఫినాల్‌, సైథియాన్‌ వంటి క్రిమిసంహారక మందులను నీటిలో కలిపి కోళ్ల షెడ్డు లోపల చుట్టుపక్కల పిచికారీ చేయాలి.

పెద్దవూర: గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఇంట్లో నాటుకోళ్లను పెంచుతారు. అంతేకాకుండా ఇటీవలి కాలంలో చాలామంది బాయిలర్‌ కోళ్ల కంటే నాటుకోళ్లను తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో చాలామంది నాటుకోళ్లను కూడా ఫాంలలో పెంచుతున్నారు. అయితే ఏటేటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈసారి ఏప్రిల్‌, మే నెలలలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వేసవిలో కోళ్లకు బద్దె పురుగు వ్యాధి ప్రభలే అవకాశం ఉందని, ఈ వ్యాధి సోకకుండా కోళ్లఫారం యజమానులు, పెరటి కోళ్ల పెయజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దవూర మండల పశువైద్యాధికారి పిట్టల చంద్రబాబు సూచిస్తున్నారు.

బద్దె పురుగు నేపథ్యం..

బద్దె పురుగు వంటి అంతర పరాన్న జీవులు కోళ్ల పేగుల్లో నివసిస్తూ వాటి పోషక పదార్థాలను సుష్టిగా హరించి వేస్తూ, జీవాల్లో ఉత్పాదక శక్తిని తగ్గిస్తాయి. చివరకు వాటిని బలహీనపరిచి పెరుగుదల లేకుండా చేస్తాయి. బద్దె పురుగు తెల్లగా సన్నటి రిబ్బన్‌ లాంటి శరీర సౌష్టవం కల్గి ఉంటాయి.

వ్యాధి సంక్రమించు విధానం..

కొన్ని రకాల చీమలు, ఈగలు, మిడతలు, పేడ పురుగు, నేలపై తిరిగే నత్తలు కోడి పెంటలోని బద్దె పురుగుల గుడ్లను తినడంతో వాటి లార్వా ఈ కీటకాల్లో పెరుగుతుంది. కోళ్లు ఈ కీటకాలను తిన్నప్పుడు లార్వా పేగుల్లో పెరిగి బద్దె పురుగులా మారుతుంది. చిన్న వయస్సు కోళ్లకు ఎక్కువగా ఈ బద్దె పురుగు వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సోకిన కోళ్ల కాళ్లలో నిస్సత్తువ, పెరుగుదల లేకపోవడం, ఎక్కువ నీరు తాగడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అతి చిన్న బద్దె పురుగులు పేగు గోడలలోనికి చొచ్చుకొని పోవడంతో రక్తస్రావం కలిగి కోళ్లు చనిపోతుంటాయి. మరికొన్ని పేగులపై చిన్న చిన్న గడ్డలు ఏర్పరుస్తాయి. బద్దె పురుగులు ఎక్కువ సంఖ్యలో ఉండి పేగులలో ఆహార కదలికకు అడ్డుపడడమేకాక, వాటి ఒత్తిడితో పేగులు బద్దలై కోళ్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ పురుగుల వలన రోగనిరోధక శక్తి తగ్గి ఇతర వ్యాధుల టీకాలు వేసినా సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు.

రోగ నిర్ధారణ ఇలా..

కోళ్ల గుంపులో ఎదుగుదల లేకున్నా, గుడ్ల ఉత్పత్తి తగ్గినా బద్దె పురుగు వ్యాధి ఉందని గ్రహించాలి. కోడి పెంటలో బద్దె పురుగుల శరీర ఖండాలు బియ్యపు గింజల్లాగా కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణకు ఒక కోడిని కోసి అందులోని ప్రేగులను చూస్తే బద్దె పురుగులు కనిపిస్తాయి.

పెద్దవూర మండల పశువైద్యాధికారి

చంద్రబాబు సూచనలు

వేసవిలో నాటుకోళ్ల పెంపకంలో జాగ్రత్తలు1
1/1

వేసవిలో నాటుకోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement