
భువనగిరిలోని రామాలయంలో పూజలు చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య
భువనగిరి : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా భువనగిరి పట్టణంలోని నల్లగొండ చౌరస్తా సమీపంలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో పూజలు చేశారు. అనంతరం సమీపంలో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల శ్రీనివాస్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం పాల్గొన్నారు.