రెబల్స్‌.. డేంజర్‌ బెల్స్‌ | - | Sakshi
Sakshi News home page

రెబల్స్‌.. డేంజర్‌ బెల్స్‌

Nov 18 2026 1:14 AM | Updated on Nov 18 2026 1:14 AM

న్యూస్‌రీల్‌

ఊరించి.. ఊసూరుమనిపించారు

పురపోరులో కూటమికి రెబల్స్‌ గుబులు పట్టుకుంది. సీటు ఆశించి భంగపడ్డ ఆశావహులు స్వతంత్రులుగా సవాల్‌ విసురుతున్నారు. వీరిని బుజ్జగించడం కూటమి పక్షాలకు తలనొప్పిగా తయారైంది. భీమవరంలో బీజేపీ ఫ్రెండ్లీ పోటీ చేస్తుందంటూ ఏకంగా కేంద్రమంత్రి ప్రకటన చేయడం కూటమిలోని లుకలుకలను బయటపెట్టింది.

బుధవారం శ్రీ 18 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

సాక్షి, భీమవరం: జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న భీమవరం, తాడేపల్లిగూడెం చైర్‌పర్సన్‌ పదవులను జనసేన, తణుకు, పాలకొల్లును టీడీపీ పంచుకున్నాయి. వార్డులకు వచ్చేసరికి తాడేపల్లిగూడెంలో 48 వార్డులకు టీడీపీ 22, జనసేన 22, బీజేపీ నాలుగు చోట్ల పోటీకి నిర్ణయించుకున్నాయి. తణుకులో 44 వార్డులకు టీడీపీ 29, జనసేన 12, బీజేపీ మూడు, పాలకొల్లులో 44 వార్డులకు టీడీపీ 34, జనసేన ఏడు, బీజేపీ మూడు వార్డుల్లో పోటీకి అంగీకారం కుదిరినట్టు సమాచారం. భీమవరంలో 52 వార్డులకు తొలుత టీడీపీకి 24, జనసేనకు 23, బీజేపీ ఐదు చోట్ల పోటీకి నిర్ణయించుకున్నారు. చివరకు బీజేపీకి నాలుగు వార్డులు మాత్రమే ఇవ్వడం దుమారం రేపింది. సాక్షాత్తు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈ విషయమై బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు. ఎంపీ, బీజేపీ సీనియర్‌ నేత పాకా సత్యనారాయణ తనయుడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన పరిస్థితి. ఫ్రెండ్లీ పోటీ చేస్తామంటూ బీజేపీ నుంచి 36 నామినేషన్లు రావడం చర్చనీయాంశంగా మారింది.

టీడీపీకి కొత్త తలనొప్పులు

తాడేపల్లిగూడెంలో చైర్మన్‌ పదవిని ఆశించి భంగపడిన టీడీపీ నేత గొర్రెల శ్రీధర్‌ వ్యవహారం చక్కదిద్దేలోపు రెబల్స్‌ బెడద పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా తయారైంది. టీడీపీకి చెందిన పలు వార్డుల్లో జనసేన, అలాగే జనసేనకు చెందిన వార్డుల్లో పలుచోట్ల టీడీపీకి చెందిన వారు స్వతంత్రులుగా నామినేషన్‌ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ స్థానిక నాయకత్వంపై సీరియస్‌ అయినట్టు సమాచారం. రెబల్స్‌తో విత్‌డ్రాలు చేయించే పనిలో ఇరు పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. పాలకొల్లులో సొంత పార్టీలోనే సీట్లు సర్ధుబాటు వ్యవహారం మంత్రి నిమ్మల రామానాయుడికి తలనొప్పిగా తయారైంది. అభ్యర్థులు ఖరారు చేయక ఆశావహులు ఎవరికి వారు నామినేషన్లు వేశారు. తమకు బీఫామ్‌లు ఇవ్వకపోతే స్వతంత్రలుగానైనా పోటీలో ఉంటామంటూ ఐదుగురు నేతలు తెగేసి చెబుతున్నట్టు సమాచారం. చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా టీడీపీ ఆబోతుల ఉషారాణిని ప్రకటించింది. మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ కర్నేని రోజారమణి తానే చైర్‌పర్సన్‌ అభ్యర్థినంటూ నామినేషన్‌ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

నిన్నమొన్నటి వరకు నీకే సీటంటూ ఊరించిన టీడీపీ, జనసేనకు చెందిన కొందరు నేతలు చివరిలో ప్లేటు ఫిరాయించడం ఆశావహులకు మింగుడు పడటం లేదు. వారి మాటలు నమ్మి లోపాయికారీగా ప్రచారాలు, సేవాకార్యక్రమాలు చేసుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వార్డుల పంపకాలు, సర్దుబాట్లు పేరిట తమకు అన్యాయం చేశారంటూ స్వతంత్రులుగా భీమవరం పట్టణంలోని 16, 18, 23, 24, 28, 40, 50 తదితర వార్డుల్లో 74 వరకు నామినేషన్లు వచ్చాయి. తణుకులో నాలుగు వార్డుల్లో పంపకాలకు భిన్నంగా టీడీపీ, జనసేనకు చెందిన రెబల్స్‌ నామినేషన్లు వేసినట్టు తెలుస్తోంది. టీడీపీకి కేటాయించిన వార్డుల్లో బీజేపీ నుంచి ఐదు వరకు నామినేషన్లు రావడం గమనార్హం.

కూటమిలో ఎడతెగని సీట్ల పంచాయితీ

స్వతంత్రులుగా బరిలో నిలిచిన భంగపాటు నేతలు

భీమవరంలో 74, పాలకొల్లులో 35, తాడేపల్లిగూడెంలో 16, తణుకులో ఏడుగురు స్వతంత్రులు

పాలకొల్లులో మంత్రి రామానాయుడుకు తలనొప్పిగా చైర్‌పర్సన్‌ పంచాయితీ

రెబల్స్‌ను బుజ్జగించే పనిలో నేతలు

తాడేపల్లిగూడెంలో ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి చర్చలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement