శ్రీవారి క్షేత్రంలో నకిలీ టికెట్ల విక్రయాలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి క్షేత్రంలో నకిలీ టికెట్ల విక్రయాలు

Mar 16 2026 7:16 AM | Updated on Mar 16 2026 7:16 AM

శ్రీవారి క్షేత్రంలో నకిలీ టికెట్ల విక్రయాలు

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమలలోని చినవెంకన్న ఆలయంలో నకిలీ దర్శనం టికెట్ల వ్య వహారం ఆదివారం బయటపడింది. టికెట్‌ కౌంటర్‌లో రూ.200 నకిలీ టికెట్లను విక్రయించిన అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఐఎస్‌జే రాజు (దేవస్థా నంలో కీలక అధికారి కుమారుడు) టికెట్‌ స్కా నర్‌, నిఘా నేత్రానికి చిక్కాడు. దీనిపై విచారణ చేపట్టిన దేవస్థానం అధికారులు సుమారు 61 నకిలీ టికెట్లను విక్రయించినట్టు గుర్తించారు. వి వరాలిలా ఉన్నాయి.. రూ.200 క్యూలైన్‌ వద్ద టి కెట్లు స్కాన్‌ చేస్తున్న సిబ్బంది మధ్యాహ్నం రెండు టికెట్లు స్కాన్‌ అవడం లేదని అధికారులకు చెప్పారు. రీసైక్లింగ్‌ టికెట్లు అయితే ‘టికెట్‌ ఆ ల్రెడీ స్కాన్డ్‌’ అని రావాలి. అయితే ‘నాట్‌ ఫౌండ్‌’ అని రావడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఈఓ యర్రంశెట్టి భద్రాజీ, ఎగ్జిక్యూ టివ్‌ ఇంజనీర్‌ డీవీ భాస్కర్‌, ఏఈఓ ఎం.దుర్గారావు, సూపరింటెండెంట్‌ ఐవీ రామారావు విచారణ చేపట్టి, రాత్రి వరకు టికెట్‌ కౌంటర్లలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే ఆ కౌంటర్‌లో ఆ టికెట్లు విక్రయించిన సదరు ఉ ద్యోగి టికెట్ల విక్రయం నిమిత్తం దేవస్థానం వి నియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌కు సమాంతరంగా మరో సాంకేతికతను వినియోగించినట్టు గుర్తించారు. ఈ ఘటనపై ఈఓ భద్రాజీ స్థా నిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రాజును విధుల నుంచి తొల గించారు.

టికెట్లు స్కాన్‌ కాకపోవడంతో బయటపడ్డ దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement