జిల్లాలో 140 కేంద్రాలు
భీమవరం: జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్ 1 వరకూ జరిగే పరీక్షలకు జిల్లాలో 132 పరీక్షా కేంద్రాలను, అపోస్ పరీక్షలకు 8 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షలకు 24,166 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు, 680 మంది అపోస్ పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రభుత్వం 6 స్క్వాడ్‌లను నియమించగా చీఫ్ సూపరింటెండెంట్, 132 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఐదుగురు అడిషనల్ డిపార్ట్‌మెంటల్ అధికారులు, కస్టోడియన్స్ 46 మంది, 1,426 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. రూట్ ఆఫీసర్లతో పరీక్షలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25 మందితో సిట్టింగ్ స్క్వాడ్‌లు కేంద్రాలను తనిఖీ చేయనున్నాయి.
కంట్రోల్ రూం ఏర్పాటు
కేంద్రాల్లో టేబుల్స్, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించారు.ఉదయం 8.45 గంటల నుంచి 9.30 గంటల వరకూ విద్యార్థులను అనుమతిస్తారు. విద్యార్థులు హాల్‌టికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలి. ప్రైవేటు స్కూల్స్ విద్యార్థులు స్కూల్ యూనిఫాంతో రావడాన్ని అనుమతించరు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.


