అక్రమాలతో పంచుకుంటున్నారు | - | Sakshi
Sakshi News home page

అక్రమాలతో పంచుకుంటున్నారు

Mar 16 2026 7:16 AM | Updated on Mar 16 2026 7:16 AM

8లో

ఎండలతో జర భద్రం

8లో

న్యూస్‌రీల్‌

మామూళ్లు.. సెటిల్‌మెంట్లు

సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: నరసాపురంలో అధికార జనసేన అవినీతి వ్యవహారాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ.. బినామీలకు దోచిపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. చట్టంలోని లొసుగులను వాడుకుని సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా పక్కా వ్యూహంతో ప్రజాధనం లూటీ చేస్తున్నారు. ఏటా రూ.4 కోట్లకు పైగా ఆదాయం తెచ్చిపెడుతున్న నరసాపురం పంటు రేవు ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. వేలం పాటలో ఎక్కువ సంఖ్యలో టెండర్లు పడకుండా, తమ బినామీలకు పాట దక్కేలా నిబంధనలను అధికారులు మార్చడం ఇటీవల చర్చనీయాంశమైంది. అలాగే మున్సిపాలిటీ డైలీ మార్కెట్‌ పాట కూడా జనసేన నేతకు దక్కేలా మున్సిపల్‌ అధికారులు వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ఇక్కడ జనసేన ఎమ్మెల్యేగా నాయకర్‌ ఉన్నా షాడో ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు సునీల్‌ నాయకర్‌ కనుసన్నల్లోనే అవినీతి తంతు జరుగుతుందనే ప్రచారం ఉంది.

వేలం పాట తగ్గించి.. బినామీలకు దోచిపెట్టి

ఉభయగోదావరి జిల్లాల మధ్య రాకపోకలకు నరసాపురం వశిష్ట గోదావరిపై పంటు కీలకం. రికార్డు స్థాయిలో ప్రయాణాలు సాగుతుంటాయి. దీంతో నరసాపురం ఫెర్రీ వేలం పాటకు విపరీతమైన పోటీ ఉంది. గతేడాది పాట రూ.4,18,18,959కు వెళ్లగా జనసేన నేతల కన్ను దీనిపై పడింది. గతేడాది పాట తగ్గించే ప్రయత్నం చేసినా కుదరకపోవడంతో ఈ ఏడాది పక్కాగా స్కెచ్‌ వేసినట్టు సమాచారం. ఇటీవల రేవు వేలం ప్రారంభ ధర రూ 3,59,06,322గా నిర్ణయించి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అయితే అధికారులు సొంత పంటు ఉంటేనే వేలంలో పాల్గొనాలనే కొత్త నిబంధన తీసుకువచ్చారు. దీంతో వేలం సమయానికి కాంట్రాక్టర్లు రెండు షెడ్యూల్స్‌ మాత్రమే కొనుగోలు చేశారు. వీరిద్దరూ కూడా ఎమ్మెల్యే కార్యాలయానికి వీర విధేయులే. పాటలో వారిద్దరూ పాల్గొంటే తక్కువ అమౌంట్‌కు కోడ్‌ చేయొచ్చు, మూడుసార్లు నిబంధనల మేరకు పాట వాయిదా వేసి చివరకు వేలాన్ని తక్కువకు ఖరారు చేసుకునేలా పథకం రచించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కొందరు పాటదారులు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేయడంతో గత్యంతరం లేక పాటను వాయిదా వేశారు.

మార్కెట్‌ పాటలోనూ..

గతేడాది మున్సిపాలిటీ డైలీ మార్కెట్‌ పాటలో రూ.43 లక్షలు హాంఫట్‌ చేసిన బినామీలు ఈ ఏడాదీ అదే తరహాలో ముందుకు వెళుతున్నారు. 2024–25లో వైఎస్సార్‌సీపీ హయాంలో మార్కెట్‌ పాట రూ.80 లక్షలకు వెళ్లగా 2025–26లో కూటమి ప్రభుత్వంలో ఓ జనసేన నేత రూ.37 లక్షలకు పాట దక్కించుకున్నారు. అనంతరం మున్సిపల్‌ గెజిట్‌లో లేనివిధంగా వ్యాపారుల నుంచి అధిక మొత్తంలో పన్నులు వసూలు చేశారు. మార్కెట్‌ పాట మొత్తం తగ్గించి రూ.43 లక్షలకు పైగా మున్సిపల్‌ ఆదాయానికి గండి కొట్టారని మున్సిపల్‌ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత 2026–27కి సంబంధించి ఈనెల 6న పాట నిర్వహించారు. పాటదారులు రింగ్‌ అయ్యి పాటకు ముందుకు రాలేదు. గతేడాది సీన్‌ను రిపీట్‌ చేయడంలో భాగంగానే కాంట్రాక్టర్ల రింగ్‌, బెదిరింపుల పర్వం కొనసాగుతుందనే ప్రచారం జరుగుతోంది.

వేసవి ఎండల నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని అంటున్నారు.

సంక్రాంతి సమయంలో కోడిపందేలు, గుండాట బరుల్లో పర్సంటేజీలపై నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. అలాగే 120 ఏళ్లుగా జరుగుతున్న వనువులమ్మ సిరిమాను తీర్థంలోనూ జయింట్‌ వీల్స్‌ ఏర్పాటుచేసిన వారి నుంచి ఈ ఏడాది రూ.లక్ష చొప్పున మామూళ్లు వసూలు చేయడం చర్చనీయాంశమైంది. ఇక రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి నెలవారీ మామూళ్లు చెల్లించాలనే కొత్త నిబంధన పెట్టి మరీ సొమ్ములను ఎమ్మెల్యే కార్యాలయానికి చేరవేస్తున్నట్టు ప్రచారం ఉంది. ఎమ్మెల్యే పేరుతో ఆయన అనుయాయులు అతి చేస్తున్నారని ఎమ్మెల్యే సన్నిహితులే గుసగుసలాడుకుంటున్నారు. అలాగే పోలీస్‌స్టేషన్‌లకు వచ్చే ఆర్థికపరమైన తగాదాలకు సంబంధించి అధినాయకుడి బ్రదర్‌ ఓ గదికి పిలిపించుకుని సెటిల్‌మెంట్ల దందా సాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాలను పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు చేరవేసినా ప్రయోజనం లేకపోవడంతో పార్టీలో ఉన్న అగ్రనాయకులు మిన్నకుండిపోతున్నారనే ప్రచారం సాగుతోంది.

ప్రభుత్వ ఆదాయం లూటీ

నరసాపురంలో శృతిమించిన జనసేన అవినీతి

రూ.4 కోట్ల రేవు ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం

మార్కెట్‌ పాటలోనూ గతేడాది తంతు రిపీట్‌

ఎమ్మెల్యే సోదరుడి కనుసన్నల్లోనే అక్రఓమాల దందాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement