ఏలూరు టౌన్: రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకుంటా రో... డ్రగ్స్ విక్ర యాలు చేస్తారో అ లాంటి వారి ఆస్తులు జప్తులు చేస్తామంటూ స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు. టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యా దవ్ డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు, ఎంపీ పుట్టా మహేష్ ఆస్తులు జప్తు చేస్తారా ? చంద్రబాబూ అంటూ వైఎస్సార్‌సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి, యువజన విభాగం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జోన్ అధ్యక్షుడు కా రుమూరి సునీల్‌కుమార్ యాదవ్ తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఏలూరు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, దేశ చరిత్రలో తొలిసారిగా డ్రగ్స్‌తో ఒక ఎంపీ దొరికిపోవటం బాధాకరమన్నారు. కూటమిలో టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలాంటి నీచమైన పనులు చేసినా సీఎం చంద్రబాబు నోరు మెదపటం లేదని, హోమంత్రి సైతం డ్రగ్స్‌ను నిరోధిస్తామని చెబుతున్నారని, అయితే ఎంపీ పుట్టా విషయంలో ఏమి చెబుతారో వేచి చూడాలన్నారు. ఎంపీ పుట్టా ఏలూ రు పరువు తీశారని, నైతికత ఉంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బుట్టాయగూడెం: డ్రగ్స్ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌యాదవ్ దొరకడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నా రు. దుద్దుకూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే ఎంపీ ఇక్కడ కొకై న్‌తో విందులు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రా జ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఇదెక్కడి బా ధ్యతారాహిత్యం అని ప్రశ్నించారు. ఎంపీ సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారో అర్థం కా వడం లేదన్నారు. ఎంపీ పదవి నుంచి మహేష్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజానిజాలు బయట పెట్టాలని అన్నారు. ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని, ప్రజల నమ్మకానికి ద్రోహం చేసేలా ప్రవర్తించకూడదని అన్నారు. ఇటువంటి సంఘటనలు ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
భీమవరం (ప్రకాశంచౌక్) : జిల్లాలో అక్షరాంధ్ర ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్‌మెంట్ టెస్ట్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. జిల్లాలో 60,865 మంది అభ్యర్థులు పరీక్షలకు నమోదు కాగా 60,829 మంది హాజరయ్యారని తెలిపారు. సుమారు 99.9 శాతం హాజరు నమోదైనట్టు వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో గ్రామ స్థాయి సిబ్బంది, వలంటీర్లు, విద్యాశాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేశారన్నారు. వయోజనులకు ప్రాథమిక చదువు, రాత, గణిత నైపుణ్యాలను అందించడమే అక్షరాంధ్ర ప్రధాన లక్ష్యమన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో 1.70 లక్షల పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించడం లక్ష్యమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఆమె గాలికుంటు వ్యాధి నివారణ టీకా ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. వచ్చేనెల 15 వరకు టీకాలను ఉచితంగా అందిస్తామన్నారు. కనీసం 90 శాతం పశువులకు టీకాలు వేయడం లక్ష్యంగా నిర్ణయించామన్నా రు. ఈ అవకాశాన్ని పశు రైతులు సద్వినియో గం చేసుకోవాలన్నారు. జిల్లా పశుసంవర్ధక శా ఖ అధికారి ఆర్.కోటిలింగరాజు, సహాయ సంచాలకుడు పి.జయకర్ జాన్సన్ పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సో మవారం పోలీస్ పీజీఆర్‌ఎస్ నిర్వహించనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. రహ దారి నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఇక్కడ పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తామన్నారు.


