ప్రజాహితమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజాహితమే లక్ష్యం

Mar 13 2026 9:01 AM | Updated on Mar 13 2026 9:01 AM

ప్రజాహితమే లక్ష్యం
పేదల గొంతుకగా.. అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా.. కారుచీకట్లలో కాంతిరేఖలా.. ప్రజాహితమే లక్ష్యంగా.. జన సంక్షేమమే అజెండాగా పుట్టిన వైఎస్సార్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాలను గురువారం జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ర్యాలీలు, జై జగన్‌.. జై వైఎస్సార్‌సీపీ నినాదాలతో హోరెత్తించారు. దివంగత వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌లు కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. పేదలకు అన్నదానాలు, దుస్తులు, దుప్పట్లు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కుట్ర రాజకీయాలను తూర్పారబడుతూ.. వైఎస్సార్‌సీపీ పాలనలో మాజీ సీఎం జగన్‌ జనరంజక పాలనను పార్టీ నాయకులు గుర్తుచేశారు.

కాళ్ల: పెదఅమిరం పార్టీ కార్యాలయంలో వేడుకల వద్ద నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్‌ నర్సింహరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌

తాడేపల్లిగూడెం: వైఎస్సార్‌సీపీ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతున్న నియోజకవర్గ కన్వీనర్‌ వడ్డి రఘురామ్‌నాయుడు

పాలకొల్లు సెంట్రల్‌: పార్టీ కార్యాలయం వద కేక్‌ కట్‌ చేస్తున్న

నియోజకవర్గ కన్వీనర్‌ గుడాల శ్రీహరిగోపాలరావు

భీమవరం : పార్టీ కార్యాలయం వద్ద వేడుకల్లో నియోజకవర్గ కన్వీనర్‌ చినమిల్లి వెంకటరాయుడు

సంక్షేమమే పరమావధి ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం దివంగత వైఎస్సార్‌కు ఘన నివాళులు జిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జెండా ఆవిష్కరణలు, కేక్‌ కటింగ్‌లు మిన్నంటిన జగన్నినాదం

సాక్షి, భీమవరం:

నరసాపురం: పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ అనంతరం స్టీమర్‌ రోడ్డు జంక్షన్‌కు పాదయాత్రగా చే రుకుని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రసాదరాజు మాట్లాడుతూ దివంగత వైఎస్సార్‌ ప్రజాసంక్షేమ ఆశయాల్లోంచి వైఎస్సార్‌సీపీ పుట్టిందని అన్నారు. కూటమి ప్ర భుత్వ పాలనపై ప్రజలు విసిగిపోయారని, మళ్లీ జగన్‌ నాయకత్వాన్ని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో అబద్ధాలతో పాలన సా గుతోందని పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు సవ్యంగా అందడం లేదన్నారు. ఎస్‌ఈసీ సభ్యులు పీడీ రాజు, పెండ్ర వీరన్న, మున్సిపల్‌ చైర్‌పర్స బర్రే శ్రీవెంకటరమణ, సోషల్‌ మీడియా జిల్లా కన్వీనర్‌ బందన పూర్ణచంద్రరావు, మత్స్యకార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తిరుమాని నాగరాజు తదితర నాయ కులు పాల్గొన్నారు.

తణుకు: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పట్టణంలోని వైఎస్సార్‌ విగ్రహాలకు కారుమూరి, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కారుమూరి మాట్లాడుతూ పేదల కష్టాల్లోంచి పుట్టింది వైఎస్సార్‌సీపీ అన్నారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయ పార్టీని ఆవిర్భవింపచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు.

తాడేపల్లిగూడెం: నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డి రఘురామ్‌నాయుడు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచారు. అనంతరం భారీ ఎత్తున పార్టీ శ్రేణులతో పట్టణంలో మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించి, పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. రఘురామ్‌నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్‌ జగన్‌ని ముఖ్యమంత్రిని చేయడమే మన లక్ష్యమని, ఆ దిశగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఉండి: నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్‌ నరసింహరాజు ఆధ్వర్యంలో పెద అమిరంలోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, జగన్‌ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాలను వివరించాలని పీవీఎల్‌, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ పి లుపునిచ్చారు. క్షత్రియ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పాతపాటి శ్రీనివాసరాజు, పార్టీ జిల్లా నాయకులు వేగేశ్న జయరామకృష్ణంరాజు, పెన్మత్స ప్రసా దరాజు పాల్గొన్నారు.

భీమవరం: రాయలంలోని పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్‌ చిత్రపటానికి నియోజకవర్గ ఇన్‌చార్జి చినమిల్లి వెంకటరాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్‌ను కట్‌ చేశారు. రాష్ట్రంలో పేదలకు అండగా నిలిచి వారి జీవితాలకు భరోసా కల్పించిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని వెంకటరాయుడు అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పేరిచర్ల విజయనర్సింహరాజు, ఏఎస్‌ రాజు పాల్గొన్నారు.

పాలకొల్లు: నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) ఆధ్వర్యంలో పట్టణంలోని పార్టీ కార్యాలయం, యలమంచిలిలో జరిగిన వేడుకల్లో గోపి పాల్గొని జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచారు. దివంగత వైఎస్సార్‌ స్ఫూర్తితో ఏర్పడిన వైఎస్సార్‌సీపీ దళిత, బడుగు, బలహీన వర్గాలకు దిక్సూచి వంటిదని గుడాల గోపి అన్నారు. పార్టీ నేతలు చెల్లెం ఆనందప్రకాష్‌, యడ్ల తాతాజీ, మేకా శేషుబాబు, కుమార దత్తాత్రేయవర్మ, కర్రా జయసరిత, డీటీడీసీ బాబు, వీరా మల్లికార్జునుడు, బండి రమేష్‌, జోగాడ ఉమామహేశ్వరరావు, మద్దా చంద్రకళ పాల్గొన్నారు.

ఆచంట: ఆచంట మండలం తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయం వద్ద జెడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. పెనుగొండ, పెనుమంట్ర, ఆచంట, పోడూరు మండలాల్లో పార్టీ శ్రేణులు పార్టీ జెండాలను ఆవిష్కరించి స్వీట్లు పంచారు. పలుచోట్ల నాయకులు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement