భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో పర్యాటక అభివృద్ధికి సహకరించాలని, గుర్తించిన స్థలాలను పర్యాటక శాఖకు అప్పగించేందుకు ఆదేశాలు ఇప్పించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి కోరారు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ నాగరాణి మాట్లాడారు. ఇదిలా ఉండగా తొలిరోజు బుధవారం జరిగిన సదస్సులో జిల్లాలో విద్యుత్ లైన్‌ల ఏర్పాటుకు డ్రోన్‌లు వినియోగిస్తున్నామని కలెక్టర్ తెలియజేయగా ముఖ్యమంత్రి అభినందించారు.
భీమవరం (ప్రకాశంచౌక్): పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్టు జిల్లా ప్రజారవాణా అధికారి ఎస్.గిరిధర్‌కుమార్ తెలిపారు. ఈనెల 16 నుంచి 28 వరకు హాల్‌టికెట్ చూపించి పరీక్షా కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఈ సదుపాయం ఉంటుందన్నారు.
ఏలూరు (టూటౌన్): ఫోర్జరీ సంతకాలతో మోసం చేసిన కేసులో పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలిలా ఉన్నాయి.. వట్లూరు పంచాయతీ ఇంద్రప్రస్థ కాలనీలో నివాసం ఉంటున్న సత్తెనపల్లి వినయ్‌కుమార్ పెదపాడు మండలం వడ్డిగూడెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బాకీ నిమిత్తం ఇంద్రప్రస్థ కాలనీకి చెందిన వీరి ఇంటిని వినయ్‌కుమార్ తల్లి కృష్ణవేణి విజయవాడకు చెందిన జ్యోతిర్మయికి విక్రయించారు. అయితే ఇంటిని వెంటనే అప్పగించకుండా గడువు కోరా రు. ఈ క్రమంలో ఇంటిని మరలా దక్కించుకోవాలనే దురుద్దేశంతో జ్యోతిర్మయి సంతకాలను ఫోర్జరీ చేసి ఇంటి పన్ను, విద్యుత్ కనెక్షన్, కొన్ని కీలక పత్రాలను వినయ్‌కుమార్, కృష్ణ వేణి తమ పేరుపై మార్చుకున్నారు. దీంతో జ్యోతిర్మయి పోలీసులను ఆశ్రయించారు. వినయ్‌కుమార్, కృష్ణవేణిపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు వినయ్‌కుమార్‌ను సస్పెండ్ చే స్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఉంగుటూరు: వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. గురువారం బాదంపూడి బైపాస్ వద్ద నిడమర్రు సీఐ రజనీకుమార్, చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ తనిఖీలు చేస్తుండగా నలుగురు యువకులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో వారిని పట్టుకున్నారు. వీరి నుంచి మో టార్ సైకిళ్లు, బంగారు, వెండి వస్తువులు, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేబ్రోలు స్టేషన్‌లో డీఎస్పీ శ్రావణ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. తంగెళ్లమూడికి చెందిన తాడి షణ్ముకరావు, రాంచరణ్ తేజ, భీమడోలుకు చెందిన దత్తి నవీన్, తూర్పుగోదవరి జిల్లా మండపేట మండల కేశవరానికి చెందిన పొందుగల అరవింద్ జులాయిగా తి రుగుతూ ఒటరి మహిళల మెడల్లోని బంగారు నగలను చోరీ చేస్తున్నారు. అలాగే గంజాయికి కూడా అలవాటు పడ్డారు. వీరి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, 5.320 కిలోల గంజాయి, బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు. వ్యసనాలకు బా నిసై చోరీలకు పాల్పడుతున్నారని, ఒడిసా ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి విశాఖ తదితర ప్రాంతాల్లో ఎంజాయి చేసి ఈ ప్రాంతంలో పట్టుబడ్డారన్నారు.
పోలవరం రూరల్: బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించినట్టు ఎస్సై ఎస్‌ఎస్ పవన్‌కుమార్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. 2018లో పోలవరం మండలం పాత గాజులగొందిలో ఐదేళ్ల గిరిజన బాలికపై అదే ప్రాంతానికి చెందిన నేరం శేఖర్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్ప డ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.వాణిశ్రీ విచారణ అనంతరం నిందితుడికి 20 ఏళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధించారు. అలాగే బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల నష్టపరిహారం అందించాలని కోర్టు ఆదేశించిందన్నారు.


