రైలు నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

Mar 13 2026 7:30 AM | Updated on Mar 13 2026 7:30 AM

రైలు నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి కారు ఢీకొని వ్యక్తి మృతి

తణుకు అర్బన్‌: తణుకు రైల్వే అవుట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారి పడి మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి నిడదవోలు నుంచి నరసాపురం వెళుతున్న పాసింజర్‌ రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారి పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిడదవోలు మండలం శెట్టిపేట సమీపంలో జరిగిన ఈ ఘటనలో వ్యక్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఖాకీ రంగు చొక్కా, నీలం రంగు ఫ్యాంటు ధరించిన వ్యక్తి కుడి చేతిపై సూరికుమారి అనే అక్షరాలతో పచ్చబొట్టు ఉందని రైల్వే పోలీసులు చెబుతున్నారు. రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఉంగుటూరు: మోటార్‌సైకిల్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం ఉంగుటూరుకు చెందిన మానేపల్లి సత్యనారాయణ (75) గురువారం రాత్రి మోటార్‌సైకిల్‌పై నారాయణపురం వెళ్లి తిరిగి వస్తుండగా ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్‌సైకిల్‌పై వెళుతున్న సత్యనారాయణ డివైడర్‌పై పడి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సూర్యభగవాన్‌ ఘటనా స్థలానికి చేరుకుని సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును చేబ్రోలు పోలీస్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement