తాడేపల్లిగూడెం రూరల్: డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా మినీ వ్యాన్ అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకెళ్లిన ఘటన మండలంలోని చినతాడేపల్లి జాతీయ రహదారి నెం.16పై గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జార్ఖండ్‌కు చెందిన సుమారు 27 మంది తీర్థయాత్రల నిమిత్తం ఈ నెల 9వ తేదిన బయల్దేరారు. దీనిలో భాగంగా దైవ దర్శనానినికి చైన్నె వెళ్తుండగా తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి జాతీయ రహదారిపై వచ్చేసరికి గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో వ్యాన్ డ్రైవర్‌కు నిద్ర మత్తు రావడంతో వ్యాన్ అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 15 మందికి గాయాలు కాగా మూడు అంబులెన్స్‌లలో తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో 11మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


