జనసేనకు ఝలక్‌ | - | Sakshi
Sakshi News home page

జనసేనకు ఝలక్‌

Mar 13 2026 9:01 AM | Updated on Mar 13 2026 9:01 AM

జనసేనకు ఝలక్‌

వైఎస్సార్‌సీపీలో 200 మంది చేరిక

తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీకి ఝలక్‌ తగిలింది. 24, 25 వార్డులకు చెందిన మహిళలు, పురుషులు సుమారు 200 మంది వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ వడ్డి రఘురామ్‌నాయుడు సమక్షంలో గురువారం వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలన, ప్రస్తుత కూటమి పాలనకు తేడాను గమనించామని, కూట మి నాయకులు సూపర్‌సిక్స్‌ పేరుతో ప్రజలను వంచించారని వారు అ న్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన అందించారని, దీంతో జనసేనను వీడి వైఎస్సార్‌ సీపీ చేరుతున్నామని చెప్పారు. నియోజకవర్గ కన్వీనర్‌ రఘురామ్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలో నా యకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకూ అంతా ఒక కుటుంబమేనని, ఎవరికి ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామన్నారు. ఎంపీపీ పొనుకుమాటి శేషులత, నాయకులు గుండుబోగుల నాగు, గొర్రెల శ్రీనివాసు, మాకరాజు సతీష్‌, మద్దుకూరి మెహెర్‌ప్రసాద్‌, బూడి ప్రసాద్‌, కలిశెట్టి తాతారావు, పెంటపాడు మండల అధ్యక్షుడు కై గాల శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement