శ్రీవారి క్షేత్రానికి ‘గ్యాస్‌’ సెగ | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి క్షేత్రానికి ‘గ్యాస్‌’ సెగ

Mar 13 2026 9:01 AM | Updated on Mar 13 2026 9:01 AM

భక్తులకు అసౌకర్యం లేకుండా చర్యలు

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయానికి వంట గ్యాస్‌ కొరత ఏర్పడుతోంది. దీంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. యుద్ధం ప్రభావంతో వాణిజ్య సిలిండర్ల సరఫరా దాదాపు నిలిచిపోయింది. దీంతో చిన వెంకన్న ఆలయ అధికారులు గ్యాస్‌కు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. తిరుమల తిరుపతిలో వినియోగిస్తున్న ఎలక్ట్రిక్‌ స్టౌవ్‌ల పనితీరును తెలుసుకుంటున్నారు. అలాగే కట్టెల పొయ్యిలపై వంటలకు సిద్ధమవుతున్నారు.

గ్యాస్‌ వినియోగం ఇలా..

భక్తుల రద్దీని బట్టి అన్నప్రసాదాన్ని వండేందుకు నిత్యం 25 నుంచి 30 గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్లను దేవస్థానం వినియోగిస్తోంది. ఈ ఒక్క అన్నదాన సదనంలోనే నెలకు 800 గ్యాస్‌ సిలిండర్లను వాడుతున్నారు. అలాగే లడ్డూ, పులిహోర, శర్కర పొంగలి ప్రసాదాల తయారీకి అంబరుఖానాలో రోజుకు 15 నుంచి 20 వాణిజ్య సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఆలయంలో స్వామివారి నివేదన ప్రసాదాలు, భక్తులకు అందించే ఉచిత ప్రసాదాల తయారీకి నిత్యం 2 వాణిజ్య సిలిండర్లను వాడుతున్నారు. ఉప, దత్తత ఆలయాల్లో పడితరాలకు నెలకు 15 వాణిజ్య సిలిండర్లను వినియోగిస్తున్నారు.

ప్రత్యామ్నాయ మార్గాలపై..

కట్టెలు పొయ్యిలపై వంటలు వండితే పదార్థాలు పొగ వాసన రావడం, బూడిద వాటిలో పడటం వంటివి జరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే కట్టెలను వినియోగిస్తూనే.. అటువంటి సమస్యలు తలెత్తకుండా వంటలను ఎలా వండాలనే అంశాలను పరిశీలిస్తున్నారు. తిరుమల తిరుపతిలో వాడుతున్న ఎలక్ట్రిక్‌ స్టౌవ్‌ల పనితీరు బాగుంటే వాటిని కూడా కొనుగోలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. అలాగే బ్లోయర్ల ద్వారా కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే వంటల తయారీకి అవసరమయ్యే కట్టెలను అధికారులు అంబరుఖానా వద్ద సిద్ధం చేశారు.

అధికారుల పరిశీలన

ఈఓ యర్రంశెట్టి భద్రాజీ గురువారం ఏఈఓ మె ట్టపల్లి దుర్గారావు, సూపరింటెండెంట్‌ కోటగిరి కిషోర్‌తో కలిసి వకుళమాత నిత్యాన్నదాన భవనంలోని వంటశాలలో వంటలు వండుతున్న తీరు, సి లిండర్ల నిల్వలను పరిశీలించారు. అంబరుఖానాలో ప్రసాదాల తయారీని, గ్యాస్‌ వినియోగాన్ని, వంటలకు సిద్ధం చేసిన కట్టెలను పరిశీలించారు.

వంటల తయారీని పరిశీలిస్తున్న ఈఓ భద్రాజీ

అంబరుఖానా వెనుక సిద్ధం చేసిన కట్టెలు

గ్యాస్‌ సిలిండర్ల కొరతను అధిగమించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాన్ని, ప్రసాదాలను అందజేస్తాం. బుధవారం వరకు గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు. అయితే గురువారం చింతలపూడి నుంచి రావాల్సిన సిలిండర్లు రాలేదు. సిలిండర్ల సమస్యపై వరుసగా రెండురోజుల పాటు ఆలయ ఏఈఓలు, సూపరింటెండెంట్లు, ఇంజనీరింగ్‌ విభాగ అధికారులతో చర్చించాను. విజయవాడ నుంచి కొన్ని ప్రత్యేకమైన పొయ్యిలను కూడా రప్పిస్తున్నాం. ప్రస్తుతం గ్యాస్‌ను వినియోగించి స్టీమ్‌ ద్వారా ఎలా వంటలు వండుతున్నారో, అదేవిధంగా కట్టెల పొయ్యిల ద్వారా వచ్చే స్టీమ్‌తో వంటలు చేయించాలని అనుకుంటున్నాం. అత్యవసర ప రిస్థితుల్లో మాత్రమే కట్టెల పొయ్యిలను వి నియోగిస్తాం. గ్యాస్‌ ఏజెన్సీలతో కలెక్టర్‌ మా ట్లాడి శ్రీవారి దేవస్థానానికి సిలిండర్ల కొరత లేకుండా చూడాలని కోరుతున్నాం.

– యర్రంశెట్టి భద్రాజీ, ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం ఈఓ

అమెరికా–ఇరాన్‌ యుద్ధం ప్రభావం

నిలిచిన వాణిజ్య సిలిండర్ల సరఫరా

శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదాల తయారీకి ప్రత్యామ్నాయ మార్గాలు

కట్టెల పొయ్యిల ఏర్పాటుకు చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement