వెట్టిచాకిరీ నిర్మూలనపై అవగాహన కల్పించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): వెట్టిచాకిరీ నిర్మూలన చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలనకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వర్ణోత్సవాల్లో భాగంగా సోమవారం గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెట్టిచాకిరీ నిర్మూలనపై అవగాహన కల్పించి సమాజంలో చైతన్యం పెంచి మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడాలన్నారు. వెట్టిచాకిరీ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని వాటిని ప్రోత్సహించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.


