ఆధునిక పద్ధతులు మేలు
ఉండి: వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, టెక్నాలజీని వినియోగిస్తే తక్కువ ఖర్చులు అధిక దిగుబడులు సాధించవచ్చని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. ఆదివారం ఉండి ఏఎంసీలో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వరి పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ సబ్‌ప్లాన్‌కు సంబంధించి రూ.28 లక్షల విలువైన బ్యాటరీ స్ప్రేయర్లను డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణరాజుతో కలిసి కలెక్టర్ ఎస్సీ రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ, పంటల నమోదు, మార్కెంటింగ్ విలువలు జోడించాలన్నారు. సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయశాఖ జేడీ జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయశాఖ చైర్మన్ జుత్తిగ నాగరాజు, ఏడీఏ ప్రతాప్‌జీవన్, ఏఎంసీ చైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.


