అలలపై ఆశల వల
ముమ్మరంగా వేట
మత్స్యకారులను ఆదుకోవాలి
నరసాపురం: వేటకు అనుకూల వాతావరణం ఉండటంతో నరసాపురం తీరం పొడవునా సముద్రంలో వేట ముమ్మరంగా జరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో సముద్రంలో చేపలు భారీగా లభించే వీలుంటుంది. దీంతో పలు జిల్లాలకు చెందిన మెకనైజ్ట్ బోట్లు తీరంలో వేట సాగిస్తున్నాయి. మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు, విశాఖ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 70 వరకూ బోట్లు నరసాపురం తీరంలో సంచరిస్తున్నాయి. ప్రస్తుత వాతావరణం చేపల వేటకు పూర్తి అనుకూలంగా ఉండటం, పైగా ఎక్కువగా చేపలు దొరికే సీజన్ కూడా కావడంతో మత్స్యకారులు బిజీగా ఉన్నారు. ప్రస్తుత సంవత్సరం (2025–26) వేట కష్టనష్టాలతో సాగుతోంది. వరుస విపత్తులు వేటకు ఆటంకంగా మారాయి. దీనికితోడు వేటబోట్లకు ప్రభు త్వం ఇచ్చే డీజిల్ సబ్సిడీ నిలిపివేయడం మత్స్యకారులను కుంగదీసింది. గతేడాది జూన్ నుంచి నవంబర్ వరకు తుపానులు, అల్పపీడనాల హెచ్చరికలతో వేట సవ్యంగా సాగలేదు. వేటబోటుకు లీటరుకు రూ.9లు చొప్పున నెలకు 300 లీటర్ల డీజిల్‌ను ప్రభుత్వం సబ్సిడీపై అందించాలి. అయితే ఈ ఏడాది డీజిల్ సబ్సిడీకి ప్రభుత్వం ఎసరు పెట్టడంతో వేట నష్టాల్లో కూరుకుపోయింది.
జనవరి నుంచి సీజన్
ప్రతికూల వాతావరణంతో నరసాపురం తీరంలో మత్స్య సంపద అంతగా లభించలేదు. గతేడాది జూన్ 15 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.200 కోట్ల మత్స్య ఎగుమతులు జరిగాయి. వాస్తవంగా రూ.300 కోట్ల వరకూ ఎగుమతులు జరగాల్సి ఉండగా.. రూ.100 కోట్ల మేరకు తగ్గాయి. ఏటా వేట నిషేధం గడువు తర్వాత జూన్ 15 నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటను నిర్వహిస్తారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకూ సీజన్ నడుస్తోంది. జనవరి నుంచి చేపలు పెద్ద సంఖ్యలో పడటం, ఆశించిన మేర ఆదాయం రావడంతో మత్స్యకారుల్లో కొంతమేర ఉల్లాసం కనిపిస్తుంది.
ముంచుకొస్తున్న వేట నిషేధం గడువు
చేపల పునరుత్పత్తి సీజన్ కావడంతో ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తుంది. మరో రెండు నెలల్లో వేట నిషేధం అమలు కానుంది. వేట నిషేధ గడువు దగ్గపడుతుండటం, ప్రస్తుత అనుకూల వాతావరణం, కలిసొస్తున్న సీజన్‌ను మత్స్యకారులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఆటు‘బోట్లు’
సముద్రంలో ముమ్మరంగా వేట
వరుస విపత్తులతో మత్స్యకారుల విలవిల
ఈ ఏడాది కలిసిరాని ఫిషింగ్
రూ.100 కోట్లకు పైగా ఎగుమతులు తగ్గుదల
ముంచుకొస్తున్న వేట నిషేధం గడువు
సముద్రంలో ముమ్మరంగా వేట సాగుతోంది. స ముద్రంలోకి వెళ్లిన బోటు వారంలోపే సరుకుతో ఒడ్డుకు చేరుతోంది. మాకు బోటు యజమానులు పడి న సరుకుకు బట్టి డబ్బులు ఇస్తారు. కాబట్టి ఆనందంగా ఉంది. ఇప్పుడే నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి. మళ్లీ రెండు నెలలు గడిస్తే వేట నిషేధం అమలవుతుంది.
– మల్లాడి సాయిబాబా, బోటు కార్మికుడు
వేట సాగించే మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి. చంద్రబాబు ప్రభు త్వం మత్స్యకార భరోసా సొమ్ములను జూలైలో ఇస్తోంది. గత ప్రభుత్వంలో మే నెలలోనే జమచేసేవారు. ప్రస్తుతం డీజిల్ సబ్సిడీ సవ్యంగా ఇవ్వకపోవడంతో పెట్టుబడు లు పెరిగిపోయాయి. డీజిల్ సబ్సిడీ రూ.15లకు పెంచి సకాలంలో అందించాలి.
–బర్రి శంకరం, మత్స్యకార నేత
అలలపై ఆశల వల
అలలపై ఆశల వల
అలలపై ఆశల వల


