జిల్లా యాదవ సంఘ ప్రమాణ స్వీకారం | - | Sakshi
Sakshi News home page

జిల్లా యాదవ సంఘ ప్రమాణ స్వీకారం

Feb 9 2026 8:22 AM | Updated on Feb 9 2026 8:22 AM

జిల్ల

జిల్లా యాదవ సంఘ ప్రమాణ స్వీకారం

జిల్లా యాదవ సంఘ ప్రమాణ స్వీకారం ప్రశాంతంగా గేట్‌ పరీక్షలు శివరాత్రికి ప్రత్యేక బస్సులు రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడి

భీమవరం: కుల సంఘాలు రాజకీయాలకు అ తీతంగా సంఘ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని శాసనమండలి చైర్మన్‌ కొ య్యే మోషేన్‌రాజు అన్నారు. ఆదివారం జిల్లా యాదవ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా భీమవరంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. మాజీ మంత్రి, అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ సంఘాన్ని మరింత పటిష్టం చేయడానికి గ్రామస్థాయిలో సమస్యలను తెలుసుకుని సంఘ సభ్యుల సమన్వయంతో పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సంఘం నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా కందుల భానుప్రసాద్‌ యాదవ్‌, కర్రి గంగాధర అ ప్పారావు, కోశాధికారిగా తానింకి జోగేశ్వర రావు, కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా పాలకొల్లు రోడ్డులో ని రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా సంఘ భవన కార్యా లయాన్ని మాజీ మంత్రి కారుమూరి ప్రారంభించి అనంతరం భారీ ర్యాలీగా సభా స్థలికి చేరుకున్నారు. రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయు డు, యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు, ఉపాధ్యక్షుడు ఉక్కుసూరి గోపాలకృష్ణ, జిల్లా మాజీ అధ్యక్షుడు గొలగాని సత్యనారాయణ పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం రూరల్‌: పెదతాడేపల్లి వాసవి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం పీజీ కోర్సుల్లో ప్రవేశానికి గేట్‌ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 150 మందికి 131 మంది, సాయంత్రం 150 మందికి 124 మంది హాజరైనట్టు కేంద్రం ప్రిసైడింగ్‌ అధికారి రాంబాబు తెలిపారు. తుది పరీక్షలు ఈనెల 15, 16వ తేదీల్లో జరుగనున్నాయన్నారు. కో–ఆర్డినేటర్‌ నటరాజ్‌, సిస్టమ్స్‌ అడ్మిన్‌ కొల్లా సురేష్‌, టీసీఎస్‌ ప్రతినిధులు పర్యవేక్షించారు.

తణుకు అర్బన్‌: మహాశివరాత్రి పర్యదినం సందర్భంగా తణుకు డిపో నుంచి శ్రీశైలంకు ఈనెల 12, 13, 14 తేదీల్లో సూపర్‌లగ్జరీ, పుష్‌బ్యాక్‌ 2 ప్లస్‌ 2 ఆడియో వీడియో కోచ్‌ బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్‌ సుధారాణి తెలిపారు. టికెట్‌ ధర పెద్దలకు రూ.820, పిల్లలకు రూ.450 అని, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ, చినకాకాని, మంగళగిరి క్షేత్రాలు దర్శించేలా ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ రూ పొందించామన్నారు. ఈనెల 14న సాయంత్రం 7 గంటలకు బస్సు బయలుదేరి 16న తణుకు చేరుతుందన్నారు. పుష్‌బ్యాక్‌ బస్సు టికెట్‌ ధర రూ.2,200గా నిర్దేశించామన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌: 9440419144 నంబర్‌లో సంప్రదించాలని ఆమె కోరారు.

భీమవరం : రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు తీ వ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని రాష్ట్ర అ మరావతి రెవెన్యూ ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌ భూపతిరాజు రవీంద్ర రాజు అన్నారు. భీమవరంలోని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్‌ జేఏసీ ఏర్పాటుచేశారు. జిల్లా చైర్మన్‌గా ఎం.సన్యాసిరావు, సెక్రటరీ జనరల్‌గా జి.పెద్దిరాజు, కన్వీనర్‌గా ఎం.లక్ష్మీనారా యణ, కో–చైర్మన్‌గా ఎం.మోషే, ట్రెజరర్‌గా కె.సుబ్రహ్మణ్యస్వామి, ప్రచార కార్యదర్శిగా పి.సంధ్యారాణి, క్రీడ, సాంస్కృతిక కార్యదర్శిగా కె.ఠాగూర్‌, ఉప చైర్మన్లుగా ఈ.నాగా ర్జున, ఎం.నాగరాజు, జి.గోపాలకృష్ణ, బీఎన్‌వీ రత్నారావు, జి.జక్కయ్య ఎన్నికయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా జిల్లా కార్యవర్గం పనిచేస్తుందని వారు అన్నారు.

జిల్లా యాదవ సంఘ ప్రమాణ స్వీకారం 1
1/2

జిల్లా యాదవ సంఘ ప్రమాణ స్వీకారం

జిల్లా యాదవ సంఘ ప్రమాణ స్వీకారం 2
2/2

జిల్లా యాదవ సంఘ ప్రమాణ స్వీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement