నూనెలు సలసల | - | Sakshi
Sakshi News home page

నూనెలు సలసల

Feb 9 2026 8:22 AM | Updated on Feb 9 2026 8:22 AM

నూనెల

నూనెలు సలసల

ధరలు షాకిస్తున్నాయి

చిరు వ్యాపారులపై భారం

తణుకు అర్బన్‌ : మార్కెట్‌లో వంట నూనెలు ధర లు మండిపోతున్నాయి. ఒక్కసారిగా పెరిగి సామా న్య, మధ్యతరగతి ప్రజలకు షాకిస్తున్నాయి. ము ఖ్యంగా కిలో వేరుశనగ నూనె రూ.180, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.165కు చేరాయి. కొద్దిరోజుల క్రితం వరకూ ధరలు తక్కువగా ఉండగా ఒక్కసారిగా ఎగబాకాయి. వీటితో పాటు పప్పుదినుసుల ధరలు పెరగడంతో ప్రజలకు వంట భారంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం వంట నూనెలు, నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో విఫలమైందని ప్రజలు బహిరంగంగానే విమర్శస్తున్నారు.

ఒక్కసారిగా పెరిగి..

గత నెలలో కిలోకు రూ.145లు ఉన్న వేరుశనగ నూనె అమాంతం కిలో ధర రూ.30 పెరిగి రూ.175 పలుకుతోంది. కంపెనీలను బట్టి కిలో రూ.180 వరకు విక్రయిస్తున్నాయి. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కిలోకు రూ.20లు పెరిగి రూ.165 నుంచి రూ.170లకు చేరింది. పామాయిల్‌ రూ.115 నుంచి రూ.130కి పెరిగింది. అలాగే వేరుశనగ గుళ్లు ఫిబ్రవరి మొ దట్లో కిలోకు రూ.50లు పెరగ్గా ప్రస్తుతం రూ.180కు విక్రయిస్తున్నారు. కిలో కందిపప్పు రూ.125, మినప్పప్పు రూ.110లకు, ఎండు మిర్చి రూ.250 నుంచి రూ.350కు విక్రయిస్తున్నారు. ఇది లా ఉండగా వంటనూనెల ప్యాకింగ్‌లో గోల్‌మాల్‌ జరుగుతుందని వినియోగదారులు అంటున్నారు. లీటరు పేరుతో 910 గ్రాముల నుంచి 800 గ్రా ముల వరకు ప్యాకింగ్‌లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రోజుకు 70 వేల కిలోలు

జిల్లాలో సుమారు రోజుకు 70 టన్నుల (70 వేల కిలోలు) వంట నూనెలు విక్రయిస్తున్నట్టు అంచనా. తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, ఆచంట, నరసాపురం, పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లోని రిటై ల్‌ మార్కెట్‌లో రోజూ పలు రకాల కంపెనీల వేరుశనగ, సన్‌ఫ్లవర్‌, పామాయిల్‌, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ వంటివి అమ్మకాలు జరుగుతున్నాయి. హోల్‌సేల్‌, రిటైల్‌ షాపులతో పాటు మాల్స్‌లో సైతం ప్రజలు వీటిని కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం ఎలాంటి పండుగలు లేకపోయినా ధరలు పెరగడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు నిట్టూరుస్తున్నారు.

వంటకు తంటా

వంట నూనెల ధరలకు రెక్కలు

అదే బాటలో పప్పు దినుసులు

సామాన్యులతో పాటు చిరు వ్యాపారులకు భారం

జిల్లాలో రోజుకు 70 టన్నుల వంట నూనెల విక్రయాలు

మార్కెట్‌లో వంట నూనెల ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. గత నెలకు ఇప్పటికీ భారీగా ధరలు పెరిగిపోయాయి. దీంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. కిలోకు గరిష్టంగా రూ.30ల వరకూ ధరలు పెరి గాయి. అలాగే నిత్యావసర సరుకుల ధరలూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు సైడ్‌లో తోపుడుబండ్లు, చిన్నపాటి దుకాణాలు నిర్వహించే చిరు వ్యాపారులు నూనెలు కొనుగోలులో ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు నష్టాలబారిన పడే పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం ధరల పెరుగుదలను నియంత్రించాలి.

–జల్లూరి జగదీష్‌, తణుకు

ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి వర్గాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులపై భారం పడింది. చిరువ్యాపారులు తమ వంటకాల్లో ముఖ్యంగా వంట నూనెలు అధికంగా వినియోగిస్తుంటారు. ధరల పెరుగుదలతో ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిపోతుందని వీరు గగ్గోలు పెడుతున్నారు. నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయని ఆహార పదార్థాల ధరలు పెంచితే వినియోగదారులు అయిష్టత చూపుతారని అంటున్నారు. ముఖ్యంగా నిత్యావసర సరుకులు, వంట నూనెలకు సంబంధించి రైతుకు లేని లా భం మార్కెట్‌లో రిటైలర్స్‌కు వస్తుందనే ఆరోపణలూ ఉన్నాయి.

నూనెలు సలసల1
1/1

నూనెలు సలసల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement