ఎవరెస్టు ఎక్కేటంత సంకల్పం
● లడక్‌లో ట్రెక్కింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన కలిదిండి ఎస్సై
● 2027లో ఎవరెస్టు ఆధిరోహణకు సన్నాహాలు
కై కలూరు: ఖాకీలంటే కాఠిన్యం కాదని, ఎవరెస్టు ఎక్కే అంత సంకల్పానికి సైతం నెరవకుండా ముందుకెళతారని నిరూపిస్తున్నారు ఏలూరు జిల్లా కలిదిండి ఎస్సై వి.వెంకటేశ్వరరావు. గణపవరం ప్రాంతం నుంచి ఆయన రెండేళ్ల క్రితం కలిదిండి ఎస్సైగా విధుల్లో చేరారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎవరెస్టు అధిరోహణ ముందస్తు సన్నాహాల్లో భాగంగా జనవరి 21న ఆయన లడక్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. నేపాల్‌కు చెందిన ట్రైనర్ దేవదాయసర్ ఆధ్వర్యంలో 12 రోజులు మైనస్ 25 డిగ్రీల సెల్సియస్‌లో 5 వేల మీటర్ల ఎత్తు వరకు వెళ్లారు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరిగి కలిదిండిలో ఎస్సైగా విధుల్లో చేరారు. ఆయన సాహసోపేత నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తూ ఎస్సైకు అభినందనలు తెలిపారు.
ఎవరెస్టు శిఖరాన్ని 2027 అధిరోహించడానికి ప్రణాళికతో శిక్షణ పొందుతున్నాను. లడక్ శిక్షణ ముందు భువనగిరిలో రాక్‌క్‌లైమింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. ఇప్పుడు శరీరంపై 15 కేజీల బరువుతో ట్రెక్కింగ్ చేయగలుగుతున్నాను. పోలీసుశాఖ నుంచి ఎవరెస్టు అధిరోహించి జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ధృడసంకల్పంతో ఉన్నాను. ఖర్చుతో కూడినది కావడంతో దాతలు ముందుకొస్తారని భావిస్తున్నాను.
– వి.వెంకటేశ్వరరావు, ఎస్సై, కలిదిండి
ఎవరెస్టు ఎక్కేటంత సంకల్పం


