ముగిసిన స్పోర్ట్స్ కార్నివాల్
భీమవరం: స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 7 నుంచి నిర్వహిస్తున్న జైత్ర–2026 స్పోర్ట్స్ కార్నివాల్ శుక్రవారం ముగిసింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు విజేతలకు బహుమతులు అందజేశారు. వాలీబాల్ పురుషుల విభాగంలో చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రథమ స్థానం సాధించగా, నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ద్వితీయ స్థానం సాధించింది. వాలీబాల్ ఉమెన్స్ విభాగంలో సెయింట్ ఆన్స్ చీరాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించగా భీమవరం విష్ణు ఇన్‌స్టిటట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు రెండో స్థానం పొందారు. కబడ్డీ పురుషుల విభాగంలో గుంటూరు విజ్ఞాన లారా యూనివర్సిటీ విద్యార్థుల ప్రథమ స్థానం సాధించగా అమరావతి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు. కబడ్డీ ఉమెన్స్ విభాగంలో గుంటూరు సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రథమ స్థానం సాధించగా ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానం అందుకున్నారు. కబడ్డీ వాలీబాల్ విభాగంలో మొదటి బహుమతిగా 25 వేల రూపాయలు చెక్కు, ద్వితీయ స్థానం పొందిన వారికి 15 వేల రూపాయలు చొప్పున అందించారు. బ్యాడ్మింటన్ ఉమెన్స్ విభాగంలో ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మొదటి స్థానం సాధించగా తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. మెన్ విభాగంలో నరసాపురం స్వర్ణాంధ్ర విన్నర్స్‌గా నిలవగా ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల టీమ్‌ద్వితీయ స్థానం సాధించింది. పికిల్ బాల్ మెన్ విభాగంలో ప్రథమ ద్వితీయ స్థానాలను ఎస్‌ఆర్‌కే ఆర్ సాధించగా, మహిళా విభాగంలో విష్ణు ఇంజనీరింగ్ కళాశాల మొదటి స్థానంలో నిలవగా ద్వితీయ స్థానంలో ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల నిలిచిందని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి.సత్యనారాయణ రాజు అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ హరి మోహన్, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్స్ జి.సారిక అవినాష్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకష్ణ నిషాంత్ వర్మ, డైరెక్టర్ డాక్టర్ జగపతి రాజు, ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బీహెచ్‌వీఎస్ రామకృష్ణంరాజు పాల్గొన్నారు.


