మహిళ హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
ఏలూరు (టూటౌన్)/చింతలపూడి: హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు 2వ అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని శుక్రవారం తీర్పు వెలువరించారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో జరిగిన మహిళా హాత్య కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి శ్రీకాకొల్లు సువర్ణరాజు(39) శిక్ష విధించారు. చింతలపూడి మండలం బంధంచర్ల గ్రామానికి చెందిన శ్రీకాకొల్లు సువర్ణరాజుకు ఆ ప్రాంతానికి చెందిన కంచర్ల సునీత అలియాస్ ప్రాంతానికి చెందిన కంచర్ల సునీత అలియాస్ గంగ(35)తో వివాహేతర సంబంధం ఉండేది. ఈ క్రమంలో ఆమె ఇతర వ్యక్తులతో ఫోన్లో మాట్లాడుతుందనే అసూయతో ముద్దాయి హాత్యకు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో 2023 జనవరి 20న చింతలపూడి మండలం బాలవారి గూడెం అడవికి ఆమెను తీసుకెళ్ళి అక్కడ ఆమైపె దాడి చేసి చీరతో ఉరి బిగించి అత్యంత కిరాతకంగా హత్యా చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు శవాన్ని కొండ దిగువన రాళ్లపై పడేశాడు. ఈ ఘటపై అప్పట్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముద్దాయిపై నేరాలు నిరూపణ అవ్వడంతో న్యాయమూర్తి సెక్షన్ 302 ఐపీసీ కింద జీవిత ఖైదు, రూ.3,000 జరిమానా విధించారు.సెక్షన్ 201ఐపీసీ కింద మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. అయితే సాక్ష్యాధారాలతో దర్యాప్తు పూర్తి చేసి దోషికి శిక్ష పడేలా కృషి చేసిన ఎస్‌బీ ఈఐ మల్లేశ్వరరావు, సీఐ క్రాంతికుమార్, సీఎంసీ ఇన్స్‌పెక్టర్ ఎం.సుబ్బారావు, ఎస్సై సతీష్‌కుమార్ కానిస్టేబుల్స్‌ను జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.


