మావుళ్లమ్మ దేవస్థానం ప్రధాన అర్చకుడికి అవమానం
భీమవరం(ప్రకాశం చౌక్): శ్రీమావుళ్లమ్మ వారి దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ(చిన్ని)కు అవవమానం జరిగింది. దేవస్థానం ధర్మకర్తలి మండలిలో మల్లికార్జున శర్మ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. శుక్రవారం ఆలయ వద్ద జరిగిన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి మల్లికార్జున శర్మను పిలవలేదు సరికదా.. అతనితో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించలేదు. దేవస్థాన అధికారులు కూటమి ప్రజాప్రతినిధులను చూసుకోవడం తప్ప ప్రభుత్వ ఇచ్చిన ఉత్తుర్వుల్లో దేవస్థానం ధర్మకర్తలి మండలిలో ఒకరిగా ఉన్న ఎ అఫీషియో సభ్యుడు మల్లికార్జున శర్మను పట్టించుకోలేదు. దాంతో ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలో చిన్ని ఆలయంలో పూజ కార్యక్రమంలో ఉండిపోయారు. దీనిపై మల్లికార్జున శర్మ మాట్లాడుతూ కోరగా ప్రమాణస్వీకారానికి తనను పిలవలేదని, సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో కూడా తాను ఆలయంలో ఉన్నప్పటికి తనని పిలవలేదని వాపోయారు. ఈ ఘటనపై ఆలయ సహాయ కమిషనర్ మహలక్ష్మీ నగేష్‌ను వివరణ కోరగా తాను ప్రధాన అర్చుకుడినికి ప్రమాణస్వీకారానికి ఆహ్వనించానని తెలిపారు.
బుట్టాయగూడెం: మండలంలోని రెడ్డిగణపవరం, దొరమామిడి గ్రామంలో రాత్రివేళల్లో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. సుమారు 10 ట్రాక్టర్‌లతో జేసీబీల ద్వారా మట్టి గుట్టలను తొలగించి ఇళ్లకు, ఇటుకల బట్టీలకు తరలిస్తున్నారు. అయితే అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచా రం అందినా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.


