గురువులపై కర్ర పెత్తనం | - | Sakshi
Sakshi News home page

గురువులపై కర్ర పెత్తనం

Jan 9 2026 11:40 AM | Updated on Jan 9 2026 11:40 AM

గురువ

గురువులపై కర్ర పెత్తనం

గురువులపై కర్ర పెత్తనం

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘాలు

గురువుల అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్ర

ఒత్తిడి వల్ల ఫలితాలు రావు

ఉపాధ్యాయులను అవమానించడమే

నిడమర్రు: చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ఉపాధ్యాయుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 8 పిరియడ్స్‌ బోధించేలా ప్రతీ సబ్జెక్ట్‌కు ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి జులై నెలలో టీచర్‌ హ్యాండ్‌ బుక్స్‌ అందించారు. దీని ప్రకారం ఉపాధ్యాయుల బోధన జరుగుతోంది. ఇటీవల 8 పిరియడ్స్‌ బోధనను 4 పిరియడ్స్‌కు కుదించి ఉదయం 4 పిరియడ్స్‌లో 8 పిరియడ్స్‌కు సంబంధించిన బోధన పూర్తిచెయ్యాలని, మధ్యాహ్నాం 4 పిరియడ్స్‌ ఎఫ్‌ఎల్‌ఎన్‌ తరగతులు నిర్వహించాలని 75 రోజుల ఎఫ్‌ఎల్‌ఎన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వమే 8 పిరియడ్స్‌ ఎలా బోధించాలో టీచర్‌ హ్యాండ్‌ బుక్స్‌ ఇచ్చి, ఇప్పుడు వాటిని 4 పిరియడ్స్‌లో బోధించాలనే నిర్ణయంపై ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి సబ్జెక్ట్‌కు అన్ని పరీక్షలు ఒకే పుస్తకంలో రాయించేలా అందించిన మూల్యాంకన పుస్తకాలతో తలలు పట్టుకుంటున్నారు. 10వ తరగతి విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత చెందేలా ఎస్‌ఎస్‌ఎసీ పరీక్షల వరకూ 100 రోజుల ప్రణాళిక రూపొందించింది. ప్రతి రోజు ఆరోజు బోధించిన సబ్జెక్ట్‌పై సాయంత్రం వేళల్లో పరీక్షలు పెట్టి రోజువారీ విద్యార్థుల మార్కులు ఆన్‌లైన్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో అమలవుతోంది. ఈ 100 రోజుల ప్రణాళిక అమలుపై విద్యాశాఖ జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకూ పర్యవేక్షణ కొనసాగుతోంది. తాజాగా ఈ పర్యవేక్షణ, పరిశీలన బాధ్యతలను మండలంలోని ఇతర శాఖలకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో విద్యాశాఖపై పరాయి శాఖల పెత్తనం చేసేలా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

పర్యవేక్షణకు 256 మంది అధికారుల నియామకం

పదో తరగతి 100 రోజుల ప్రణాళిక అమలుపై ఏలూరు జిల్లాలోని 256 ఉన్నత పాఠశాలలకు ఆయా మండలాల, పట్టణాల్లోని వ్యవసాయశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌, రెవెన్యూ, మండల పరిషత్‌, పంచాయతీరాజ్‌ శాఖ, వెలుగు, ఇరిగేషన్‌, ఉద్యానవనశాఖ, సీ్త్రశిశు సంక్షేమశాఖ, పశువర్ధకశాఖ, వైద్యశాఖ, గృహనిర్మాణశాఖ, మత్య్సశాఖ, పోలీస్‌శాఖ, టౌన్‌ప్లానింగ్‌ వంటి శాఖలకు చెందిన గెజిటెడ్‌ అధికారులను ప్రత్యేక తరగతుల నిర్వహణా పర్యవేక్షణకు నియమించారు. ఈ మేరకు జిల్లా ఉన్నత అధికారుల నుంచి ఉత్తర్వులు గత నెలలో జారీ అయ్యాయి.

చానమిల్లి జెడ్పీస్కూల్లో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంపీడీవో (ఫైల్‌)

గణపవరం జెడ్పీస్కూల్లో విద్యార్థుల ప్రగతి పరిశీలిస్తున్న డీవైఈవో రామాంజనేయులు (ఫైల్‌)

ఇప్పటికే విద్యాశాఖలోని అన్ని స్థాయిల్లో అధికారులు ప్రతి రోజు టెన్త్‌ విద్యార్థులకు అమలవుతున్న 100 రోజుల ప్రణాళికల అమలుపై తనిఖీలు చేస్తూ ఉన్నత అధికారులకు నివేదికలు ఇస్తున్నారు. అయినా ఇతర శాఖలను ఉపాధ్యాయులపై పెత్తనం చేసేలా, వారి పనితీరును, బోధనను పర్యవేక్షించేలా తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పలు రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు. డీఈఓ, డీప్యూటీ డీఈఓ, ప్రతి మండలానికి ఇద్దరేసి చొప్పున మండల విద్యాశాఖ అధికారులు, ప్రతి ఉన్నత పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ప్రధానోపాధ్యాయులు, సీనియర్‌ ఉపాధ్యాయులను కాదని.. ఇతర శాఖల అధికారులను ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా నియమించడాన్ని ఆక్షేపిస్తున్నారు. పదో తరగతి ఫలితాల్లో ఏమైనా తేడాలొస్తే ఈ మానిటరింగ్‌ ఆఫీసర్లు బాధ్యత తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.

టెన్త్‌లో వంద శాతం ఉత్తీర్ణతకు 100 రోజుల ప్రణాళిక

పర్యవేక్షణకు ఇతర శాఖల అధికారుల నియామకం

ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయుల ఆగ్రహం

విద్యాశాఖ అమలు చేస్తున్న ప్రణాళిక అమలు తీరుపై విద్యాశాఖ అధికారులు ఉండగా ఇతర శాఖలను పర్యవేక్షణ అధికారులుగా నియమించడం ఉపాధ్యాయుల అస్థిత్వం దెబ్బతీసే కుట్రగా భావిస్తున్నాం. ఇలాంటి పర్యవేక్షణలను ఏమాత్రం సహించేది లేదు. ఇది మంచి పరిణామం కాదు.

– గెడ్డం సుధీర్‌, రాష్ట్ర నాయకులు, వైఎస్సార్‌టీఏ

ప్రత్యేక తరగతులు నిర్వహించే విషయంలో ప్రభుత్వం, ఇతర శాఖల వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. విద్యాశాఖలో ఎంతో అనుభవం ఉన్న సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఉన్నారు. వారిని కాదని ఇతర ఽశాఖలకు పెత్తనం వల్ల విద్యార్థులకు ఒరిగేది ఏమి ఉండదు. ఒత్తిడి వల్ల ఆశించిన ఫలితాలు రావు.

– పుప్పాల సూర్యప్రకాశరావు, స్టేట్‌ కౌన్సిలర్‌, ఎస్టీయూ

ఇప్పటికే సెలవు దినాలు, ఆదివారాలు సైతం ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ రోజువారీ పరీక్షల ఫలితాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఉపాధ్యాయుల బోధనా పనితీరును పర్యవేక్షించేందుకు ఇతర శాఖల అధికారులను నియమించడం ఉపాధ్యాయులను అవమానించడమే.

– బోర్రా గోపీ మూర్తి, టీచర్స్‌ ఎమ్మెల్సీ

గురువులపై కర్ర పెత్తనం 1
1/4

గురువులపై కర్ర పెత్తనం

గురువులపై కర్ర పెత్తనం 2
2/4

గురువులపై కర్ర పెత్తనం

గురువులపై కర్ర పెత్తనం 3
3/4

గురువులపై కర్ర పెత్తనం

గురువులపై కర్ర పెత్తనం 4
4/4

గురువులపై కర్ర పెత్తనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement