రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పట్టివేత

Jan 9 2026 11:40 AM | Updated on Jan 9 2026 11:40 AM

రేషన్

రేషన్‌ బియ్యం పట్టివేత

రేషన్‌ బియ్యం పట్టివేత జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక నేడు ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ ఏలూరు రాక మెడికల్‌ కళాశాలకు శరీర దానం తల్లిదండ్రులపై కుమార్తె దౌర్జనం

పాలకొల్లు (సెంట్రల్‌) : పాలకొల్లు పట్టణం, చెంబునిపేటలో గురువారం విజిలెన్స్‌, రెవెన్యూ, పౌర సరఫరా అధికారులతో సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రవాణాకు సిద్ధంగా ఉన్న 3 టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వ్యాన్‌ను సీజ్‌ చేసినట్లు విజిలెన్స్‌ ఎస్సై కె.సీతారాం తెలిపారు. బియ్యం విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందన్నారు. యజమాని కనమర్లపూడి శేషగిరిరావు, డ్రైవర్‌ పీతాని మోహనకృష్ణలపై నిత్యవసర వస్తువుల చట్టం 1955 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ ఎస్సై కె.సీతారాం, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌జీఎన్‌వీ కుమార్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

నూజివీడు: జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు పట్టణంలోని సెయింట్‌ మేరీస్‌ హైస్కూల్‌ విద్యార్థి పీ రేవంత్‌ ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ జోజిబాబు తెలిపారు. జార్ఘండ్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్‌ జట్టుకు రేవంత్‌ నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ను ప్రిన్సిపాల్‌ అభినందించి గురువారం క్రీడా కిట్‌ను అందజేశారు. రేవంత్‌ను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

ఏలూరు (టూటౌన్‌): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌.జవహర్‌ ఈనెల 9న ఏలూరు రానున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వై.విశ్వమోహాన్‌ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి మీటింగ్‌ హాల్‌లో జిల్లాలోని ఎస్సీ సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారన్నారు. ముందుగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏలూరు, రెవెన్యు గెస్ట్‌హౌస్‌ నందు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని తెలియజేశారు. ఈ అవకశాన్ని ప్రజలు సద్వినియోగించు కోవలసినదిగా డీడీ విశ్వమోహాన్‌ రెడ్డి కోరారు.

పెదపాడు: మానవత సేవాసంస్థ రాష్ట్ర చైర్మన్‌, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారుబోయిన కోటేశ్వరరావు తన భార్య సూర్య నాగమణి భౌతికకాయాన్ని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు దానం చేశారు. నాగమణి అనారోగ్యంతో బుధవారం మరణించారు. తన మరణంలో కూడా సేవ ఉండాలనే ఆశయంతో తన శరీరాన్ని మరణానంతరం మెడికల్‌ కళాశాలలకు అప్పగించేందుకు ముందస్తుగా అనుమతి పత్రాన్ని అందించారు. దీంతో సూర్యనాగమణి భౌతికకాయాన్ని కోటేశ్వరరావు మెడికల్‌ కళాశాలకు అప్పగించారు. వివిధ జిల్లాలకు చెందిన మానవత ప్రతినిధులు సూర్య నాగమణి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

కుక్కునూరు: తల్లిదండ్రులపై కుమార్తె దౌర్జన్యం చేసి బెదిరింపులకు పాల్పడడంతో కేసు నమోదు చేసినట్లు కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి పేర్కొన్నారు. వింజరం గ్రామానికి చెందిన కరేటి చిట్టెమ్మ, కృష్ణయ్య దంపతులు, వారి వ్యవసాయ భూములకు వచ్చిన పోలవరం ముంపు పరిహార డబ్బులను వారి బ్యాంక్‌ ఖాతాల నుంచి మోసపూరితంగా కుమార్తె చిమడబోయిన మంగమ్మ, ఆమె కుటుంబసభ్యుల ఖాతాలకు బదిలీ చేసుకుంది. అలాగే వారి గొర్రెలు, మేకలను అక్రమంగా స్వాధీనం చేసుకోవడంతో ప్రశ్నించిన వృద్ధ దంపతులను అసభ్య పదజాలంతో దూషించి, శారీరకంగా దాడి చేసి, చంపుతామని బెదిరింపులకు గురిచేసింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు.

రేషన్‌ బియ్యం పట్టివేత 1
1/2

రేషన్‌ బియ్యం పట్టివేత

రేషన్‌ బియ్యం పట్టివేత 2
2/2

రేషన్‌ బియ్యం పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement