సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
భీమవరం: భీమవరం డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం సైబర్ నేరాలు, యాంటీ క్రైమ్ చర్యలు, పోకో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు సైబర్ నేరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్ కాల్స్, నకిలీ వెబ్‌సైట్స్ వంటి మోసాలు, సోషల్ మీడియా వేదికల్లో వ్యక్తిగత సమాచారాన్ని నిర్లక్ష్యంగా పంచుకోవడం వలన తీవ్రమైన నష్టం ఏర్పడే ప్రమాదముందని హెచ్చరించారు. కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) మాట్లాడుతూ విద్యార్ధులు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ జి.కాళీచరణ్, కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అంజన్‌కుమార్ పాల్గొన్నారు.


