వైఎస్సార్ సీపీలో నేతలకు పదవులు
తణుకు అర్బన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో జిల్లాకు చెందిన నేతలకు వివిధ పదువులు కేటాయిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. తణుకుకు చెందిన పొట్ల సురేష్‌ను రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శిగా, అడ్డా వెంకట సూర్యనారాయణ (బాబు)ను రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శిగా నియమించారు. దీనిపై వారు మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు.
రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పెదవీరప్ప
ఉండి: వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పాములపర్రు గ్రామానికి చెందిన తాటిపట్టి పెదవీరప్ప నియమితులయ్యారు. పార్టీ నియోజకవర్గ కళాకారుల సెల్ అధ్యక్షుడిగా మల్లువలస దుర్గారావు, కళాకారుల జిల్లా అధ్యక్షుడుగా రేలంగి సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు.
చింతలపూడి నుంచి ముగ్గురికి జిల్లా పదవులు
చింతలపూడి: వైఎస్సార్ సీపీ క్రీస్టియన్ మైనార్టీ జిల్లా కార్యదర్శిగా చింతలపూడికి చెందిన కాటూరి ఏలియ, పార్టీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ ఖాజా మొయినుద్దీన్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా మహమ్మద్ హాజీలను నియమించారు.
పెనుగొండ: వైఎస్సార్ సీపి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పెనుగొండ మండలం సిద్ధాంతానికి చెందిన ఎంపీటీసీ చిన్నం ఏడుకొండలును, సత్యవరం గ్రామానికి చెందిన తమనంపూడి సూర్య వెంకట గణేష్ రెడ్డిని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమించారు.
వైఎస్సార్ సీపీలో నేతలకు పదవులు
వైఎస్సార్ సీపీలో నేతలకు పదవులు
వైఎస్సార్ సీపీలో నేతలకు పదవులు
వైఎస్సార్ సీపీలో నేతలకు పదవులు
వైఎస్సార్ సీపీలో నేతలకు పదవులు
వైఎస్సార్ సీపీలో నేతలకు పదవులు
వైఎస్సార్ సీపీలో నేతలకు పదవులు


