
ఫీజులు చెల్లించాలంటున్న యాజమాన్యం
భీమవరంలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాను. విద్యాదీవెన, వసతి దీవెన మొదటి ఏడాదికి మాత్రమే సొమ్ములు వచ్చాయి. ద్వితీయ సంవత్సరం ఒక విడత సొమ్ములు వచ్చాయి. దాదాపు రూ.12 వేలు బకాయిలు రావల్సి ఉంది. ఫీజులు పూర్తిగా చెల్లిస్తేనే సరిఫికెట్స్ ఇస్తామని కళాశాల యాజమాజ్యం చెబుతుంది.
– డి.లక్ష్మీరాజ్, భీమవరం
నేను తృతీయ సంవత్సరం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను. మొత్తం రూ.11,250 ఫీజు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం కేవలం రూ.3,750 మాత్రమే ఇచ్చింది. మిగిలిన సొమ్ములు ఎప్పుడు వేస్తారో తెలియడం లేదు. కళాశాల యాజమాన్యం ఫీజు చెల్లించాలని ఒత్తిడి తెస్తోంది.
– ధీరజ్, నరసాపురం, డిగ్రీ విద్యార్థి
పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయక పోవడంతో అనేకమంది డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారు. ఫీజులు కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తామంటూ అనేక కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నాయి. ప్రభుత్వం తక్షణం నిధులు విడుదల చేయకుంటే పోరుబాట తప్పదు.
– టి.ప్రసాద్, ఎస్‌ఎఫ్‌ఐ, జిల్లా కార్యదర్శి

ఫీజులు చెల్లించాలంటున్న యాజమాన్యం

ఫీజులు చెల్లించాలంటున్న యాజమాన్యం