ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు | - | Sakshi
Sakshi News home page

ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు

Aug 27 2025 9:51 AM | Updated on Aug 27 2025 9:51 AM

ఫీజు

ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2025

భీమవరం: విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసి పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. తీరా అధికారం చేపట్టాక ఉద్యోగాల సంగతి పక్కన పెడితే చదువుకునే పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అటకెక్కించారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు అని యాజమాన్యాలు చెబుతుండడంతో ఉద్యోగాలు కోల్పోతున్నామని ఆందోళన చెందుతున్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగానికి పెద్ద పీటవేసి ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్‌ విద్యాసంస్ధల కంటే మిన్నగా అభివృద్ధిచేశారు. పేదలు సైతం ఉన్నత విద్యనభ్యసించేలా మౌలిక వసతులు కల్పించడమేగాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విద్యాదీవెన, వసతి దీవెన వంటి అనేక పథకాలను సక్రమంగా అమలు చేశారు. మనబడి నాడు–నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర గడిచిపోతున్నా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా చెల్లించకపోవడంతో అప్పులు చేసి ఫీజు బకాయిలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది.

జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం పట్టణాలతోపాటు అనేక చోట్ల ఇంజనీరింగ్‌, పీజీ, డిగ్రీ కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి విద్యనభ్యసిస్తున్నారు. గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయా విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సకాలంలో చెల్లించడంతో విద్యార్థులు చక్కగా విద్యాభ్యాసంపై దృష్టిపెట్టి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగావకాశాలు పొందారు. కూటమి ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా పాత బకాయిలతోపాటు ప్రస్తుత విద్యాసంవత్సరానికి సుమారు 31 వేల విద్యార్థులకు దాదాపు రూ.138 కోట్లు విద్యా, వసతి దీవెన బకాయిలు చెల్లించాల్సి ఉంది. కేవలం కొంతమంది విద్యార్థులకు మాత్రమే దాదాపు రూ.18 కోట్లు విడుదలైనట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది ఇంజనీరింగ్‌, డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వం ఆయా కళాశాలలకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్స్‌ తీసుకోడానికి వెళ్తే.. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్స్‌ ఇస్తామంటూ కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందిపెట్టాయ. అనేక మంది ఉద్యోగాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. పెద్ద మొత్తంలో ఫీజు బకాయిలు చెల్లించడానికి తమ వద్ద సొమ్ములు లేవని అప్పులు చేయాలంటే సాధ్యం కావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చదివినా సర్టిఫికెట్లు పొందలేకపోవడంతో కూలీ పనులకు వెళ్లాల్సి వస్తుందని ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తే చిన్నదో పెద్దదో ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉండేవారమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తే ఊరట కలుగుతుందని చెబుతున్నారు.

ఉద్యోగాలు కోల్పోతున్నామని విద్యార్థుల ఆందోళన

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో ఇబ్బందులు

జిల్లాలో 31 వేల మందికి రూ.138 కోట్ల బకాయి

ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు 1
1/1

ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement