
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. అంగన్‌వాడీకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి. టార్గెట్ల పేరుతో అంగన్‌వాడీలను తీవ్రంగా వేధిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అంగన్‌వాడీలపై వేధింపులు తక్షణం ఆపాలి. లేని పక్షంలో వారికి అండగా సీఐటీయూ పోరాటం చేస్తుంది.
– డీఎన్‌విడి ప్రసాద్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
ప్రస్తుతం చెల్లిస్తున్న చాలీ చాలని వేతనాలు, మరో పక్క పెరిగిన నిత్యావసరాల ధరలతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఫేస్ క్యాప్చర్‌తో నిమిత్తం లేకుండా రేషన్ అందించే వెసులుబాటును అధికారులు కల్పించాలి. నెట్, సిగ్నల్స్ లేకపోవడం, సర్వర్ పనిచేయకపోవడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
– పి.సుజాత, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు
గత కాలపు సమ్మె ఒప్పందాలను తక్షణం అమలు చేయాలి. గ్రాట్యూటీ కోసం ఇచ్చిన జీవోల్లో మార్పులు చేయాలి. పాత ఫోన్లలో రెగ్యులర్‌గా చేయాల్సిన యాప్‌ల అప్‌లోడ్‌తో అవస్థలు పడుతున్నాం. అసలు ఫోన్లలో లేని స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర యాప్‌లను అధికారులు చేయిస్తున్నారు. మరో పక్క పాత ఫోన్లలో పీడీఎఫ్ ఫైల్స్ ఓపెన్ కావడం లేదు.
– పి.భారతి, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి