అకాల వర్షం.. రైతన్నకు నష్టం
అకాల వర్షం రైతన్నకు నష్టాన్ని మిగిల్చింది. ఆచంట నియోజకవర్గంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో రైతులు నష్టపోయారు. 8లో u
ప్రశాంతంగా పాలిసెట్ పరీక్ష
భీమవరం: పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం బీవీ రాజు విద్యాసంస్థల్లోని సీతా పాలిటెక్నిక్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం సెంటర్‌కు ఎంతమందిని కేటాయించారు, ఎంతమంది హాజరయ్యారనే వివరాలను చీఫ్ కోఆర్డినేటర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లాలో భీమవరంలో 4, తాడేపల్లిగూడెంలో 2, తణుకులో 8, నరసాపురంలో 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 7,254 మంది ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 6,489 మంది హాజరయ్యారని చెప్పారు.
నీట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
జిల్లా వ్యాప్తంగా మే 4న నిర్వహించే నీట్ యూజీ– పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేశామని, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నీట్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై నీట్ యూజీ అధికారులు, సూపరింటెండెంట్‌లు, విద్యాశాఖాధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని తాడేపల్లిగూగెంలోని నిట్, శశి ఇంజనీరింగ్ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలకు మొత్తం 2,100 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించే పరీక్షకు ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని చెప్పారు. దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష కేంద్రంలో వీల్ చైర్స్, సహాయకులను ఏర్పాటు చేయాలన్నారు. గూగుల్ మీట్‌లో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, డీఆర్‌ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డీఈఓ ఈ.నారాయణ తదితరులు పాల్గొన్నారు.


