నరసాపురం రూరల్: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 2025–26కు సంబంధించి మాధవాయిపాలెం ఫెర్రీ వేలం శుక్రవారం నిర్వహించారు. వేలం రూ.4,1818,959లకు ఖరారైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మించి వేలం ఆదాయం రూ.1.20 కోట్ల మేర పెరిగింది. సీల్డ్ కం బహిరంగ పద్ధతిలో నిర్వహించిన వేలంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం టేకిశెట్టిపాలెం గ్రామానికి చెందిన శ్రీ విఘ్నేశ్వర క్వారీ అండ్ బోట్స్‌మెన్ లేబర్ కాంట్రాక్ట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పాట దక్కించుకుంది. నరసాపురం, సఖినేటిపల్లి ఉమ్మడి పశ్చిమగోదావరి జెడ్పీ ఏఓ భవానీ, రెవెన్యూ అధికారి హరికృష్ణ, ఎంపీపీలు మైలాబత్తుల సోనీ, వీరా మల్లికార్జునరావు, నరసాపురం, రాజోలు డీఎల్పీఓలు, ఎంపీడీఓ గాదిరాజు రామకృష్ణంరాజు, ఎంపీడీఓ పర్యవేక్షకుడు వీరభద్రరావు ఆధ్వర్వంలో వేలం నిర్వహించారు. పట్టణ ఎస్సై ముత్యాలరావు పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.