
బంగారం వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి
భీమవరం: ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు బంగారం అమ్మడానికి వస్తే అది దొంగ బంగారమా? కాదా? అని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు గాని అమ్మకం గానీ చేయాలని డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య అన్నారు. భీమవరం పట్టణ పరిధిలోని త్యాగరాజ భవన్‌లో బంగారు వ్యాపారస్తులకు బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బంగారపు షాపులలో జరిగే దొంగతనాల గురించి జాగ్రత్తలు వహించాలన్నారు. బంగారం వ్యాపారస్తులందరూ పోలీస్ వారికి సహకరించి దొంగతనాల నివారణలో సహకారం అందించాలని కోరారు. సమావేశంలో వన్ టౌన్, టూ టౌన్ సీఐలు ఎం.నాగరాజు, కాళీచరణ్, ఎస్సై కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.