అన్ని స్థాయిల్లో 80 శాతం కమిటీల ఏర్పాటు పూర్తి
నరసాపురం: వైఎస్సార్‌సీపీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.విజయభ్కారరెడ్డి చెప్పారు. బుధవారం సాయంత్రం నరసాపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ జిల్లా ప్రతినిధుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పారీ వార్డు, గ్రామ కమిటీల ఏర్పాటు దాదాపుగా 80 శాతం పూర్తయ్యిందన్నారు. పార్టీని సంస్థాగతంగా బలంగా తీర్చిదిద్దే ప్రయత్నం సాగుతుందని వివరించారు. వైఎస్సార్‌సీపీ ప్రజల గుండెల్లో ఉందన్నారు. వైఎస్సార్‌సీపీకి రానున్నవి మంచి రోజులని, పార్టీ నాయకులు అధైర్యపడకుండా ముందుకు వెళ్లాలని, కార్యకర్తలకు అండగా ఉండాలని సూచించారు.
జిల్లాలో కమిటీల ఏర్పాటు దాదాపు పూర్తి
వైఎస్సార్‌సీపీ గ్రామ, వార్డు కమిటీల ఏర్పాటు జిల్లాలో దాదాపుగా పూర్తయ్యిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. వార్డులు, గ్రామాల వారీగా పార్టీ సమావేశాలు పెట్టి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని కమిటీల ఏర్పాటు చేశామన్నారు. రెండేళ్ల కూటమి పాలన వంచన, మోసంతో సాగిందని, ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కూటమి దగాకోరు పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు అండగా పోరాటాలు చేస్తామన్నారు. సదస్సులో పార్టీ స్టేట్ ఆర్గనైజేషన్ యాక్టివిటీ అండ్ కోఆర్డినేషన్ టీమ్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని వివరించారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరం, పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు చినమిల్లి వెంకటరాయుడు, గుడాల గోపీ, పీవీఎల్ నర్శింహరాజు, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు పీడీ రాజు, పెండ్ర వీరన్న మాట్లాడారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పప్పుల రామారావు, వైకేఎస్, చాగంటి సత్యనారాయణ, షేక్ బులిమస్తాన్, బర్రి శంకరం, పార్టీ పట్టణ అధ్యక్షుడు కామన బుజ్జి, మండల అధ్యక్షుడు ఉంగరాల రమేష్, తిరుమాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సదస్సులో మాట్లాడుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, దిశానిర్దేశం చేస్తున్న విజయభాస్కరరెడ్డి


