భీమవరం(ప్రకాశం చౌక్): నాడు జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో నాడు–నేడు పథకంలో పాఠశాలలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాకు రూ.9.72 కోట్లు కేటాయించి 60 భవనాలను మంజూరు చేశారు. భవన నిర్మాణంతో పాటు ఫర్నీచర్, కిచెన్, హాలు, క్లాస్ రూమ్, టాయిలెట్ తదితర సౌకర్యాలు కల్పించారు. ఒక్కో భవనానికి రూ.16 లక్షలు వెచ్చించారు. గత ప్రభుత్వం కాలంలో దాదాపు 90 శాతం మేర భవనాలు ప్రారంభించగా.. ఆరు భవనాలను వేగంగా పూర్తి చేసి అంగన్‌వాడీ కేంద్రాలకు అప్పగించారు. మిగతా భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే వాటిని పూర్తిచేసి అంగన్ వాడీ కేంద్రాలకు అప్పగించడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. జిల్లాలో మొత్తం 1,562 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 626 సెంటర్లను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.
జగన్ ప్రభుత్వం 90 శాతం భవనాల నిర్మాణం చేపట్టింది. వాటిలో కొన్ని ప్రారంభించగా.. కొన్ని నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మిగతా భవనాల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా.. తమకు ఎందుకన్నట్లు ప్రభుత్వం వ్యహరిస్తోంది. ప్రభుత్వం వచ్చి 10 నెలలవుతున్నా భవనాల నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. దాంతో అద్దె ఇళ్లలో అంగన్‌వాడీ కేంద్రాలు నడపాల్సి వస్తోంది. జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు విమర్శలు చేయడం తప్ప జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నిర్మించిన అంగన్‌వాడీ భవనాలను ప్రారంభించాలనే ఆలోచన లేదు.
నాడు చంద్రబాబు 10 ఏళ్ల పాలనలో జిల్లాలో అక్కడడక్క అరకొర భవనాలు నిర్మిస్తే.. జగన్ తన 5 ఏళ్ల పాలనలో రెండేళ్లు కరోనా వల్ల ఇబ్బంది పడినా.. మూడేళ్లలో అంగన్‌వాడీ భవనాల నిర్మాణం మొదలుపెట్టారు. చంద్రబాబు పాలన వచ్చి 10 నెలలు అవుతున్నా అంగన్‌వాడీలకు కొత్త భవనాలు నిర్మించడం లేదు. పూర్తయిన భవనాలను ప్రారంభించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో 6 భవనాలు వినియోగంలోకి వచ్చాయి. 17 భవనాలు 95 శాతం పూర్తయ్యాయి. 13 భవనాలకు శ్లాబ్ పూర్తి చేశారు. మరో 5 భవనాలు 100 శాతం పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. నిర్మాణం పూర్తయినవి ప్రారంభించడం లేదు. వివిధ దశల్లో ఉన్న వాటి నిర్మాణం పూర్తి చేయడం లేదు.
గత ప్రభుత్వంలో అంగన్‌వాడీ భవనాల మంజూరు ఇలా..
మండలం భవనాల
నిర్మాణం
ఆచంట 7
పెనుగొండ 1
పెనుమంట్ర 2
పోడూరు 9
భీమవరం 2
వీరవాసరం 2
మొగల్తూరు 10
నర్సాపురం 2
పాలకొల్లు 4
మండలం భవనాల
నిర్మాణం
యలమంచిలి 4
పెంటపాడు 3
తాడేపల్లిగూడెం 2
అత్తిలి 4
ఆకివీడు 1
కాళ్ల 1
పాలకోడేరు 2
గణపవరం 4
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 60 భవనాల మంజూరు
6 భవనాలు ప్రారంభించగా.. 5 భవనాలు 100 శాతం పూర్తి
వివిధ దశల్లో మిగతా భవనాలు
వాటిని పూర్తి చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం