
పెద్దింట్లమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
కై కలూరు: మండలంలోని కొల్లేటికోట శ్రీపెద్దింట్లమ్మ ఉత్సవాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో అమ్మవారి ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. ఉత్సవాల సందర్భంగా అర్చకులు ఉదయం నుంచి అమ్మవారికి వివిధ వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు అయిభీమవరం గ్రామానికి చెందిన గొట్టుముక్కల వెంకటసత్యనారాయణరాజు, సుబ్బలక్ష్మి దంపతులు, పొత్తూరి సురేష్‌రాజు, శ్రీలత దంపతులు ఉచితంగా ప్రసాద వితరణ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కై కలూరుకు చెందిన శ్యామలా నాటక కళా అకాడమీ నిర్వాహకురాలు కురేళ్ళ లక్ష్మీజ్యోతి శిష్యబృందం కూచిపూడి భరతనాట్య ప్రదర్శన ఇచ్చింది. ఏర్పాట్లను ఆలయ ఈఓ కూచిపూడి శ్రీనివాసు పర్యవేక్షించారు.
ఇరువర్గాల దాడిలో ఏడుగురికి గాయాలు
జంగారెడ్డిగూడెం: ఓ పొగాకు బ్యారన్ విషయంలో తలెత్తిన వివాదానికి సంబంధించి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడానికి చెందిన ఒక వర్గానికి సంబంధించిన తొమ్మిదేళ్ల వెంకటరత్నం, తొమ్మిదేళ్ల వీరభద్రరావు, తొమ్మిదేళ్ల నరసింహారావు, తొమ్మిదేళ్ల సూర్యచంద్రరావులు, మరో వర్గానికి చెందిన ధనేకుల తరుణ్‌కుమార్, ధనేకుల చల్లారావు, డెక్కం నాగరాజు ఒకరిపై ఒకరు గురువారం రాత్రి కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురికి తలలపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వీరంతా చికిత్స కోసం స్థానిక ఏరియా ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో వీరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.