భీమవరం (ప్రకాశంచౌక్): సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం నుంచి రెండు రోజులపాటు నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొంటున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించడంతో పాటు వివిధ జిల్లాల పనితీరుపై చర్చ జరిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయ సేకరణ నిర్వహించగా పశ్చిమగోదావరి జిల్లా 74.1 శాతం సానుకూల అభిప్రాయం నమోదు చేసుకుని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
తాడేపల్లిగూడెం: విద్యార్ధులు మారుతున్న సాంకేతిక పరిస్ధితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఏపి నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్.వి.రమణరావు కోరారు. నిట్‌లో ఈ నెల 13,14 తేదీల్లో నిర్వహించనున్న ఉల్కాన్‌జీ 26 వేడుకల పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. సంస్ధ కల్పిస్తున్న వనరులను సద్వినియోగం చేసుకొని , విద్యార్దులు బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలన్నారు. విద్యార్ధుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉల్కాన్‌జీ వేడుకలు ఉపయోగపడతాయన్నారు. ఉల్కాన్.జీ పోస్టర్‌ను , వెబ్‌సైట్‌ను ఆయన ఆవిష్కరించారు. డీన్లు వి.సందీప్, ఎన్.జయరాం,హిమబిందు, రాజేశ్వర్‌రెడ్డి, , కర్టెన్ రైజర్‌లో భాగంగా విద్యార్ధులు చేసిన నృత్యాలు అలరించాయి.
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని వెంకట్రామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్తగా పనిచేస్తున్న డాక్టర్ పి.విజయలక్ష్మి బదిలీ అయ్యారు. ఉద్యాన కళాశాల ప్రొఫెసర్‌గా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో డాక్టర్ కిరణ్‌కుమార్ సమన్వయకర్త బాధ్యతలు స్వీకరించనున్నారు.


