
నూజివీడు 29వ వార్డులో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే తనయుడు మేకా వేణుగోపాల అప్పారావు
నూజివీడు: చంద్రబాబు మాయమాటలు నమ్మి టీడీపీకి ఓటు వేసి కష్టాలు తెచ్చుకోవద్దని వైఎస్సార్ సీపీ నూజివీడు నియోజకవర్గ నాయకులు, ఎమ్మెల్యే తనయుడు మేకా వేణుగోపాల అప్పారావు (చంటినాయన) అన్నారు. పట్టణంలోని 29వ వార్డులో బుధవారం రాత్రి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఒకవైపు సంక్షేమ పథకాలతో ప్రజల సంక్షేమానికి, మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాటుపడ్డారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రతాప్ అప్పారావు వల్లే సాధ్యమవుతుందన్నారు. వైఎస్సార్ సీపీ తరుపున ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావును, కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్‌లను గెలిపించాలని కోరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రామిశెట్టి త్రివేణీదుర్గ, పార్టీ పట్టణ అధ్యక్షులు శీలం రాము, మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యన్నారాయణ, మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యులు రామిశెట్టి మురళీకృష్ణ, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి కోటగిరి పూర్ణిమ, క్రిస్టియన్ మైనారిటీ విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షులు పిళ్లా చరణ్ పాల్గొన్నారు.