పోటెత్తిన దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

పోటెత్తిన దరఖాస్తులు

Nov 18 2026 1:20 AM | Updated on Nov 18 2026 1:20 AM

పోటెత్తిన దరఖాస్తులు

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో పోటాపోటీ 6.70 లక్షలు దాటిన దరఖాస్తులు.. పార్టీల్లో గుబులు

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికల సందడి మొదలైంది. ఈనేపథ్యంలో ప్రధాన పార్టీలు పట్టభద్రుల ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించి పోటాపోటీగా శిబిరాలు నిర్వహించాయి. ఇటీవల అధికారులు చేసిన ప్రకటన ప్రకారం ఎమ్మెల్సీ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే ఈసారి లక్షకుపైగా దరఖాస్తులు అదనంగా వచ్చాయి.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 12 జిల్లాలకు చెందిన ప్రాంతాలున్నాయి. పాత ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రాతిపదికన 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో ఉమ్మడి వరంగల్‌ జిల్లా వారీగా అధికారులు ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం.. 2,49,010 ఓట్లు నమోదు చేసుకున్నారు. అత్యధికంగా హనుమకొండలో 68,057 నమోదు చేసుకున్నారు. వరంగల్‌లో 66,956, మహబూబాబాద్‌ 53,718, జనగామ 35,418, జయశంకర్‌ భూపాలపల్లి 15,337, ములుగులో 9,524 నమోదు చేసుకున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. పట్టభద్రుల నియోజకవర్గం (ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం) పరిధిలో 2021లో 5,05,565 మంది ఓటర్లు ఉండగా.. ఈసారి 6,70,407 దరఖాస్తులు వచ్చాయి. అంటే.. దరఖాస్తుల సంఖ్యలో 1,64,842 పెరుగుదల ఉంది. మొత్తం దరఖాస్తుల్లో సుమారు 63.4 శాతం ఆమోదం పొందగా, దాదాపు 33.5 శాతం ఇంకా పరిశీలనలో ఉన్నాయి.

పార్టీల్లో మొదలైన గుబులు

ఈసారి ఓటర్ల నమోదు సంఖ్య పెరగడం అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశముంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఓటర్లు ఎవరికి మద్దతిస్తారనేది ఆసక్తికరం కానుంది. ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి, విద్యారంగ సమస్యలు ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశాలయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్‌లో ఉద్యోగ నియామకాలు, యూనివర్సిటీలు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు కూడా అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయనుండగా, గత ఎన్నికల జాబితాలో లేని పట్టభద్రులు ఈసారి అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడంతో వారి రాజకీయ అభిరుచులు ఫలితాలను ప్రభావితం చేయవచ్చన్న చర్చ సాగుతోంది.

స్వీకరించినవి ఆమోదించినవి

వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఎమ్మెల్సీపై ప్రధాన పార్టీల గురి

2021తో పోలిస్తే లక్షకుపైగా పెరిగిన దరఖాస్తులు

ఓటర్ల నమోదులో దూకుడు.. ఎమ్మెల్సీ పోరుకు ఊపు

ఈ నెల 25న ముసాయిదా ఓటర్ల జాబితా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement