కాకతీయ వైద్య కళాశాలలో ఏడు రోజులపాటు జరిగిన వార్షిక సాంస్కృతికోత్సవం (ఉత్కర్ష–2026) మంగళవారం రాత్రి ముగిసింది. చివరి రోజు ‘రిథమ్ రయట్’ వైభవంగా జరిగింది. వివిధ క్రీడా పోటీలు, ఇన్‌స్ట్రాగ్రాం పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సురేష్ చంద్ర హరి, పి.విజయచందర్ రెడ్డి, డాక్టర్ ఎస్.కె. జైస్వాల్, డాక్టర్ రవికుమార్, కేఎంసీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేశ్, ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌లాల్ పాల్గొన్నారు. – కాశిబుగ్గ


