పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ

Nov 18 2026 1:20 AM | Updated on Nov 18 2026 1:20 AM

పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ

హన్మకొండ అర్బన్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితంగా నిర్వహించాలని, అర్హత కలిగిన ప్రతీ ఓటరుకు తుది జాబితాలో చోటు కల్పించాలని ఉమ్మడి జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకురాలు హరిచందన అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండకు వచ్చిన ఆమె స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించారు. విచారణలు నిర్వహించిన తీరు, ఇంటింటి సర్వే, క్షేత్రస్థాయి పరిశీలన నివేదికలను సమీక్షించారు. జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పురోగతిని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ వివరించారు. తొలి విడతలో మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన, రెండు చోట్ల ఓటు కలిగిన 1,01,697 మంది పేర్లను ఏఎస్‌డీడీ జాబితాలో గుర్తించినట్లు తెలిపారు. రెండో విడత నోటీసుల ప్రక్రియలో 970 మందిని అనర్హులుగా గుర్తించినట్లు వివరించారు.

రేపు వ్యాస రచన, క్విజ్‌ పోటీలు

ఎన్నికల అక్షరాస్యత సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో క్విజ్‌, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, ఆర్డీఓ వెంకటేశ్‌, హనుమకొండ, కాజీపేట తహసీల్దార్లు రవీందర్‌రెడ్డి, రాజు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు జగత్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

పట్టాలు ఇప్పించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

కాజీపేట: వైఎస్‌ఆర్‌ నగర్‌ కాలనీ స్థలంపై కన్నేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి వెంటనే గుడిసెవాసులకు ఇంటి నివేషన స్థలాలు ఇప్పించి తన నిజాయితీని నిరూపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. కా జీపేట మీడియా పాయింట్‌ ఆవరణలో మంగళవా రం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ నగర్‌ కాలనీలో 144 సెక్షన్‌ విధించడానికి ఎమ్మెల్యే ఎవరని ప్రశ్నించారు. అల్లుడితో కలిసి భూకబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే వెంటనే రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి సీలింగ్‌ ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలు, రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగులకు కార్యాలయాలు, మీడి యా సెంటర్‌, నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇప్పించాలని కోరారు. ‘కుడా’ మాజీ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్‌ రమేశ్‌ పాల్గొన్నారు.

● అర్హులైన ప్రతీ ఓటరుకు తుది జాబితాలో చోటు కల్పించాలి

● ఎస్‌ఐఆర్‌ రోల్‌ అబ్జర్వర్‌ హరిచందన

మాజీ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement