● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
రాయపర్తి: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 940 మంది లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతీ కుటుంబంలో సంక్షేమం వెలుగులు నిండాలనే ఉద్ధేశ్యంతో అర్హులైన వారికి నూతన పింఛన్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ నాగపద్మజ, మండలప్రత్యేకాధికారి శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్ధార్ శ్రీనివాస్, ఎంపీడీఓ పాక శ్రీనివాసులు, ఆర్‌ఐ చంద్రమోహన్, సీసీ యాదగిరి, మండలకేంద్రం సర్పంచ్ గారె సహేంద్రభిక్షపతి, రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.


