సంగెం: మండలకేంద్రంలోని స్వయంభు శ్రీ గంగా భవాని సమేత సంగమేశ్వరాలయంలో కార్తీక మా సంలో పవిత్ర శ్రావణ నక్షత్రం విశేష కోటి సోమవా రం పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పల్లకి సేవ(శావా)ను భక్తులు మంగళవాయిద్యాల నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మునుకుంట్ల కోటేశ్వర్, ఇప్పకాయల మనోహర్, అర్చకుడు అప్పె నాగార్జున శర్మ, భక్తులు పాల్గొన్నారు.


