పర్వతగిరి పోలీస్‌స్టేషన్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పర్వతగిరి పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

పర్వతగిరి: పర్వతగిరి పోలీస్‌స్టేషన్‌ను సోమవారం ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌ వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించారు. ఈ మేరకు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.సంతోష్‌ డీసీపీకి పూలమొక్క అందజేయగా సిబ్బంది గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశా రు. దొంగతనం కేసుల పురోగతి, నేర నియంత్రణ విషయాల్లో పోలీసులు తమ పని తీరును మెరుగు పర్చుకోవాలన్నారు. ఫిర్యాదుదారులు చెప్పేది పూర్తిగా విని వారి సమస్యకు తగిన పరిష్కారం చూపాలన్నారు. అనంతరం సిబ్బందితో మాట్లాడి వారి ఆరోగ్యం, కుటుంబ సభ్యు ల వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.సంతోష్‌, ఎస్సై రాజ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

రేపు చేయూత పింఛన్ల పంపిణీ సభ

ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్‌

గీసుకొండ: చేయూత సామాజిక పింఛన్ల కొత్త లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసేందుకు ఈనెల 18న (బుధవారం) కేఎంటీపీ పైలాన్‌ వద్ద జరిగే సభ ఏర్పాట్లను సోమవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్‌ సత్యశారద అధికారులతో కలిసి పరిశీ లించారు. సభా ప్రాంగణం, పార్కింగ్‌, లబ్ధిదా రుల కోసం సీటింగ్‌ ఏర్పాట్లపై సమీక్షించారు. గీసుకొండ, సంగెం మండలాలు, 15,16,17 డివిజన్లకు చెందిన కొత్త లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ వసంత, తహసీల్దార్లు ఎండీ రియాజుద్దీన్‌, రాజ్‌కుమార్‌, ఎంపీడీఓ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ పరిశీలన

నర్సంపేట రూరల్‌: నర్సంపేట పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో భాంజీపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాఽధికారి కిరణ్‌ రాజ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను సోమవారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ప్రకాశ్‌ పరిశీలించారు. వ్యాక్సినేషన్‌ జరుగుతున్న విధానాన్ని పరిశీలించి, వ్యాక్సినేషనల్‌ ప్రక్రియలో పాటించాల్సిన పలు సూచనలు చేశారు. కళాశాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం ప్రమాణాలను పాటించాలని ప్రిన్సిపాల్‌ కు సూచించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

నర్సంపేట రూరల్‌ : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో రెండున్నర తులాల బంగారం, 12 తులాల వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. నర్సంపేట ఎస్సై రామకృష్ణచారి కథనం ప్రకారం.. పట్టణంలోని వివేకానంద కాలనీలో ఉంటున్న చిటమల్ల బ్రహ్మచారి గత నెల 24తేదీ తన భార్యతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్న తన కూతురు వద్దకు వెళ్లి సోమవారం ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సమయంలో ఇంటిపైకప్పు రేకు తొలగించి ఉంది. అలాగే, బీరువాలో భద్రపరిచిన రెండున్నర తులాల బంగారు గొలుసు, 12 తులాల వెండి ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.

‘ఎట్టకేలకు సద్దుమణిగిన వివాదం’

ఖిలా వరంగల్‌: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నెలకొన్న ప్రతిష్టంభనకు సోమవా రం తెరపడింది. మార్కెట్‌ కార్యదర్శి, ఓ వ్యా పారి మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో కొనుగోళ్లు నిలిచిన విషయం తెలిసిందే. చాంబర్‌ ఆ ఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు, మార్కెటింగ్‌ శాఖ అధికారుల మధ్య జరిగిన చర్చలు సఫలంతో కావడంతో సమస్య కొలిక్కివచ్చింది. దీంతో నేటినుంచి యఽథావిధిగా క్రయవిక్రయాలు జ రుగుతాయని జిల్లా మార్కెటింగ్‌ అధికారి నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement