పద్మశాలీలు ఆత్మగౌరవంతో బతకాలి | - | Sakshi
Sakshi News home page

పద్మశాలీలు ఆత్మగౌరవంతో బతకాలి

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

● అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షుడు ఈగ మల్లేశం

రాయపర్తి: పద్మశాలీలు వలసలు వదిలి సొంత గడ్డమీద ఆత్మగౌరవంతో నిలబడాలని అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షుడు ఈగ మల్లేశం పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని మైలారం గ్రామంలో సోమేశ్వర టెక్స్‌టైల్స్‌, మ్యానుఫ్యాక్చరర్స్‌ వీవర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో భూమి కొనుగోలు చేసి లబ్ధిదారులకు ప్లాట్ల పంపిణీ, సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ బతుకుదెరువుకోసం తెలంగాణ నుంచి సూరత్‌ వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన పద్మశాలీలు, అక్కడ సంపాదించిన సొమ్ముతో తిరిగి సొంత గడ్డకు రావడం అభినందనీయమన్నారు. మైలారంలో భూమిని కొనుగోలు చేసి సొంతంగా పవర్‌ లూమ్‌ చీరల ఫ్యాక్టరీ నిర్మించాలని సంకల్పించడం రాబోయే తరాలకు మార్గదర్శకమన్నారు. అనంతరం అసోసియేషన్‌ సభ్యులకు డ్రా పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్‌, వైద్యం రాజగోపాల్‌, జిల్లా అధ్యక్షుడు ఆడెపు రవీందర్‌, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బచ్చు ఆనందం, రాష్ట్ర కోఆర్డినేటర్‌ పులికంటి రాజేందర్‌, వెంగళ వేణుగోపాల్‌, నల్ల సత్యనారాయణ, వన్నాల ప్రశాంత్‌, గోరంటల రాజు, సాగర్‌, సోమేశ్వర టెక్స్‌టైల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కుమారస్వామి, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement