లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

● కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

వరంగల్‌ లీగల్‌: జిల్లాలోని స్కానింగ్‌ కేంద్రాల్లో గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద హెచ్చరించారు. సోమవారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో జిల్లా స్థాయి పీసీపీఏ డీటీ అప్రాప్రియేట్‌ అథారిటీ కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన, జిల్లా జడ్జి నిర్మల గీతాంబ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ స్కానింగ్‌ కేంద్రాల రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌ దరఖాస్తులను పరిశీలించి, నిబంధనల ప్రకారం అనుమతుల మంజూరుపై చర్చించారు. స్కానింగ్‌ కేంద్రాల పనితీరు, చట్టం అమలు తీరును సమీక్షించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 వేల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏసీపీ అంకిత్‌ కుమార్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి. రాజారెడ్డి, ఆర్డీఓ టి.సుమ, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సాజిదా తదితరులు పాల్గొన్నారు.

ఖేల్‌ ఇండియా పోటీలకు ఏర్పాట్లు చేయాలి

న్యూశాయంపేట : వచ్చే నెల 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా క్రీడలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ సంజయ్‌జాజు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి అన్ని జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. క్రీడాపోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వీసీలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసా ద్‌, కలెక్టర్‌ సత్యశారద, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement