● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
● గ్రీవెన్స్‌కు 188 వినతులు
వినతులు ఇలా..
● అంగవైకల్యం కలిగిన తనకు ఈ–స్కూటర్ ఇప్పించడంతో పాటు దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని గొర్రెకుంటకు చెందిన జన్ను మోహన్ వేడుకున్నారు.
● వరంగల్ నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్ తోట ప్రభు త్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఆ ప్రాంత మహిళలు కోరారు.
న్యూశాయంపేట: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజలు అందించిన ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 63, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు సంబంధించి 27, డీఆర్‌డీఓ 18, పీడీ హౌసింగ్ 14, ఉపాధి శాఖ 13, వ్యవసాయ శాఖకు 12 (మొత్తం 188) దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎల్.కిషోర్‌కుమార్, వై.వి.గణేష్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ వసంత, హౌసింగ్ పీడీ విష్ణువర్ధన్‌రెడ్డి, డీడబ్ల్యూఓ రాజమణి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


