ఇంటర్‌ విద్యార్థులకు ఆటల పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థులకు ఆటల పోటీలు

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

● డీఐఈఓ డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌

కాళోజీ సెంటర్‌: ఈనెల చివరి వారంలో కళాశాల స్థాయి, జిల్లా స్థాయిలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించాలని జిల్లా ఇంటర్మీ డియట్‌ విద్యాధికారి డాక్టర్‌ శ్రీధర్‌సుమన్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం కృష్ణాకాలనీ జూనియర్‌ కళాశాల నూతన భవనంలో ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు నవంబర్‌ చివరి వారంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వివిధ ఆటల పోటీలు నిర్వహించాలన్నారు. గెలు పొందిన వారికి జిల్లా స్థాయిలో నిర్వహించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో ప్రథ మ సంవత్సరం 5,953, ద్వితీయ సంవత్సరంలో 6,142 మంది విద్యార్థులు అడ్మిషన్‌ పొందారాన్నారు. సోమవారం నాటికి 12,348 మందికి 10,172 మంది (82 శాతం) విద్యార్థులు వార్షిక పరీక్ష ఫీజులు చెల్లించారన్నారు. అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు మారిన సిలబస్‌ ప్రకారం అంతర్గత పరీక్షల రికార్డులను పరిశీలించి మూల్యాంకనం నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో పలు కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఆటల విభాగం ఇన్‌చార్జ్‌లు, నాన్‌టీచింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement