నల్లబెల్లి: అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అక్రమాలు లేదా నిబంధనల ఉల్లంఘిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమాధికారి రాజమణి స్పష్టం చేశారు. ‘చేసిన పనులే మళ్లీ చేసి! ‘శీర్షికన సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. జిల్లాలో కిచెన్ గార్డెన్‌కు అనుకూలత ఉన్న 90 కేంద్రాలను తొలుత గుర్తించి, ఆ తర్వాతే వాటికి వాటర్ హార్వెస్టింగ్, టీవీలు, ఆర్‌ఓ ఫిల్టర్లు, బాల పెయింటింగ్ పనులు మంజూరు చేశామని తెలిపారు. ఎక్కడా రెండోసారి బాల పెయింటింగ్ వేయలేదని, అవసరమైన కేంద్రాలకే ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. జిల్లాలోని 90 అంగన్‌వాడీ కేంద్రాల కోసం కేటాయించిన రూ.22.50 లక్షల నిధులను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా ఖర్చు చేస్తున్నామని ఆమె వెల్లడించారు.


