ముందు ఫార్మసీ.. వెనుకాల క్లినిక్‌ | - | Sakshi
Sakshi News home page

ముందు ఫార్మసీ.. వెనుకాల క్లినిక్‌

Nov 14 2026 1:35 AM | Updated on Nov 14 2026 1:35 AM

ముందు ఫార్మసీ.. వెనుకాల క్లినిక్‌

టీజీఎంసీ తనిఖీల్లో నకిలీ వైద్యుల గుర్తింపు

కాశిబుగ్గ: నగరంలోని పలుచోట్ల గురువారం సాయంత్రం తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ (టీజీఎంసీ) బృందం చేపట్టిన తనిఖీల్లో నకిలీ డాక్టర్ల బాగోతం బయటపడింది. ఇందిరానగర్‌లోని శ్రీలక్ష్మి ఫార్మసీని బి.కరుణాకర్‌ అనే వ్యక్తి నిర్వహిస్తుండగా అదే భవనం వెనుక గదిలో శ్రీలక్ష్మి క్లినిక్‌ నిర్వహిస్తున్నాడు. బోర్డుపై డాక్టర్‌ బి. మోహనకృష్ణ ఎండీ, డాక్టర్‌ ఎన్‌.అవినాష్‌ ఎంబీబీఎస్‌ పేర్లు, వారి మెడిల్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్లు ప్రదర్శించారు. కానీ, లోపల రోగులకు హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆర్‌కే రావు అనే వ్యక్తి వైద్యం చేస్తున్నట్లు టీజీఎంసీ అధికా రులు గుర్తించారు. సదరు వ్యక్తి ఇంటర్‌ కూడా చదవలేదని పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో ప్రణతి క్లినిక్‌కు డాక్టర్‌ కె.సుస్మిత పేరుతో అనుమతి తీసుకోగా గడువు ముగిసింది. కానీ, ఫార్మసీ చదివిన ఎన్‌.సందీప్‌ తానే వైద్యుడిగా చెప్పుకుంటూ వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. దీంతోపాటు రెడ్డికాలనీ, ఇందిరానగర్‌ ప్రాంతాల్లో సిద్దార్థ క్లినిక్‌ నిర్వహణకు సంబంధించి విజయ, మరో క్లినిక్‌ నిర్వహకుడు వేణులపై గతంలో కేసులు నమోదు చేయగా, కలెక్టర్‌, డీఎంహెచ్‌ఓకు కౌన్సిల్‌ తరఫున లేఖలు పంపించినప్పటికీ చర్యలు తీసుకోలేదని తెలిపారు.

బోర్డుపై పేరున్న వైద్యులకు నోటీసులు..

క్లినిక్‌ బయట ఫ్లెక్సీల్లో పేర్లున్న సదరు వైద్యులకు నోటీసులు జారీ చేయనున్నారు. వీరిపై పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు చేయనున్నట్లు టీజీఎంసీ సభ్యుడు డాక్టర్‌ వి.నరేశ్‌కుమార్‌, కో ఆప్టెడ్‌ సభ్యుడు వెంకటస్వామి, జిల్లా యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్‌ మహ్మద్‌ అన్వర్‌ మియా, ఐఎంఏ సెక్రటరీ డాక్టర్‌ ఎస్‌.శిరీష్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement